• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HACKERS LEAKED MILLIONS OF AIRTEL NUMBERS WITH AADHAAR AND OTHER DETAILS NS

Airtelకు షాకిచ్చిన హ్యాకర్లు.. ఆన్లైన్ లో అమ్మకానికి 25 లక్షల మంది యూజర్ల డేటా.. వివరాలివే..

Airtelకు షాకిచ్చిన హ్యాకర్లు.. ఆన్లైన్ లో అమ్మకానికి 25 లక్షల మంది యూజర్ల డేటా.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ సమాచారాన్ని అమ్మకానికి కూడా ఉంచడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

  • Share this:
    ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ సమాచారాన్ని అమ్మకానికి కూడా ఉంచడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఎయిర్టెల్‌ సిమ్‌ కార్డులను వాడుతున్న వారి మొబైల్ నంబర్లతో పాటు, వారి ఆధార్‌ సంఖ్య, జెండర్, నివాస ప్రాంతం, తదితర వివరాలను కొందరు హ్యాకర్లు వివిధ మార్గాల ద్వారా సేకరించారు. ఎయిర్‌టెల్‌ సర్వర్ల నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా హ్యాకర్లు సేకరించినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన యూజర్ల సమాచారం పెద్ద మొత్తంలో లీక్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే హ్యాకర్లు మాత్రం భారత్ లోని అందరు ఎయిర్ టెల్ యూజర్ల డేటా తమ వద్ద ఉందని వారు చెబుతున్నారు. ఆ డేటాను కూడా అమ్మకానికి ఉంచుతామని వారు చెబుతున్నారు.

    ఇదిలా ఉంటే.. ఎయిర్‌టెల్‌ సెక్యురిటీ టీమ్‌తో 3500 డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్స్‌ ఇవ్వమని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్‌ వర్కవుట్ కాకపోవడంతో ఆ డేటాను ఇలా బయటపెట్టినట్లు. ఇందుకోసం హ్యాకర్లు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు.



    అందులో హ్యాక్ చేసిన యూజర్ల సమాచారాన్ని పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారాన్ని రాజశేఖర్‌ రాజహర్యా అనే ఇంటర్నెట్‌ సెక్యురిటీ రీసెర్చర్‌ బయటపెట్టారు. తన ట్విట్టర్‌ ఖాతాలో ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్‌ చేశాడు. ఈ విషయంపై ఎయిర్టెల్ స్పందించింది. "ఎయిర్టెల్ తన వినియోగదారుల ప్రైవసీని కాపాడటానికి అనేక రకాల చర్యలను అమలు చేస్తోందన్నారు. తమ వద్ద నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని స్పష్టం చేసింది."
    Published by:Nikhil Kumar S
    First published: