ఇదో కొత్త రకం మోసం... బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయం

Cyber Crime : సైబర్ నేరగాళ్లు... ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేరాలు చేస్తున్నారు. ప్రజలను బురిడీ కొట్టించి... బ్యాంక్ అకౌంట్లలో డబ్బు కాజేస్తున్నారు. అలాంటి ఓ మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం. అలా మనకు జరగకుండా జాగ్రత్తపడదాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 9:46 AM IST
ఇదో కొత్త రకం మోసం... బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయం
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 9:46 AM IST
హోల్‌సేల్ వ్యాపారి అయిన శంకర్రావు రెగ్యులర్‌గా తన బ్యాంక్ అకౌంట్‌తో లావాదేవీలు జరుపుతూ ఉంటాడు. ఈ సందర్భంగా... చాలా మందికి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అలాగే... అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వాళ్లంతా అతనికి డబ్బును బ్యాంక్ అకౌంట్ ద్వారానే చెల్లిస్తున్నారు. శంకర్రావు బ్యాంక్ అకౌంట్‌కి, అతని ఫోన్ నంబర్ లింక్ అయి ఉంది. ఓ హ్యాకర్ ఆ ఫోన్ నంబర్ సేకరించాడు. సరిగ్గా అలాంటి నంబరే ఉన్న (ఒకట్రెండు నంబర్లు తప్ప) మరో నంబర్ సిమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తెలివిగా... శంకర్రావు బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించాడు. శంకర్రావు అకౌంట్ ఐడీ ఇచ్చాడు. పాస్‌వర్డ్ మర్చిపోయినట్లుగా ఉండే ఆప్షన్ (Forget Password) ఎంచుకున్నాడు. వెంటనే బ్యాంక్... "మీ మొబైల్ నంబర్‌కి OTP వచ్చింది. అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి" అని అంది.

వెంటనే శంకర్రావుకి కాల్ చేశాడు... "సారీ సారూ... నా ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటూ... పొరపాటున నా మొబైల్ నంబర్ బదులు... మీ నంబర్ ఎంటర్ చేశాను. అందువల్ల నాకు రావాల్సిన OTP మీకు వచ్చింది. దయచేసి ఆ OTP నాకు చెప్పి... పుణ్యం కట్టుకోగలరు. మాది పేద కుటుంబం. ఉద్యోగం చాలా అవసరం" అంటూ ఓ రేంజ్‌లో నటించాడు. అసలే బిజీలో ఉండే శంకర్రావు... ఓకే ఓకే.. దాందేముంది రాసుకోండి" అంటూ... తనకు వచ్చిన OTPని చెప్పేశాడు.

ఆ హ్యాకర్ వెంటనే OTP ఎంటర్ చేసి... శంకర్రావు అకౌంట్‌లోకి లాగిన్ అయ్యాడు. రూ.3లక్షల 28వేలు వేర్వేరు అకౌంట్ల లోకి ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. అతను ట్రాన్స్‌ఫర్ చేసింది మనం వాడే రెగ్యులర్ బ్రౌజర్ నుంచీ కాదు. హ్యాకర్లు వాడే బ్లాక్‌చైన్ హ్యాకింగ్ బ్రౌజర్ నుంచీ. అందువల్ల శంకర్రావు ఇప్పుడు ఆ డబ్బును రికవరీ చేసుకోలేకపోతున్నాడు. పోలీసులు కూడా ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచీ జరిగాయో చెప్పలేమంటున్నారు. సిమ్ కార్డు కోసం ఇచ్చిన ఐడీ ప్రూఫ్‌లు కూడా డూప్లికేట్ అని తేలింది. హ్యాకర్ మొబైల్ స్విచ్ఛాఫ్ అయ్యింది.

ఇలా ఏ విధంగా కూడా దొరకకుండా... మనల్నే OTP అడిగి... మన అకౌంట్ల లోంచే మనీ కొట్టేస్తున్నారు హ్యాకర్లు. అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరికీ OTPలు, పాస్‌వర్డ్‌లూ చెప్పొద్దని మరోసారి కోరారు పోలీసులు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...