ఇలా మీరు చేస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌‌లో డబ్బులు పోయినట్లే...

Hyderabad Crime : ఈ కేసులో బాధితుడికి జరిగినట్లు, ప్రతి ఒక్కరికీ జరిగే అవకాశాలున్నాయి. అందువల్ల మనం జాగ్రత్త పడాలి. లేదంటే అడ్డంగా బుక్కైపోతాం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 11:38 AM IST
ఇలా మీరు చేస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌‌లో డబ్బులు పోయినట్లే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 11:38 AM IST
హైదరాబాద్... రామాంతాపూర్‌కి చెందిన 48 ఏళ్ల సాంబయ్య (పేరు మార్చాం) సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. రోజూ తన పని తాను చేసుకోవడం తప్పితే... బ్యాంకులకు వెళ్లడం, ఏటీఎంలకు వెళ్లడం వంటివి చాలా తక్కువ. అసలు బ్యాంకుల వ్యవహారాల గురించే ఆయనకు పెద్దగా తెలియవు. అలాంటి సాంబయ్యకు ఓ రోజు... ఓ ఫోన్ కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వ్యక్తి... తాను ఎయిర్‌టెల్ నుంచీ ఫోన్ చేస్తున్నాననీ, తన పేరు కిషోర్ అనీ చెప్పుకున్నాడు. అప్‌గ్రేడేషన్‌లో భాగంగా... కొత్త సిమ్‌లు ఇస్తున్నామని చెప్పాడు. అందువల్ల ఇప్పుడున్న సిమ్... రేపటి కల్లా బ్లాక్ అయిపోతుందని వివరించాడు. అలా జరగకుండా ఉండాలంటే... UPI అకౌంట్ నుంచీ రూ.10 చెల్లించాలని అన్నాడు. సాంబయ్య... తనకు UPI అంటే ఏంటో తెలియదన్నాడు. వెంటనే కిషోర్... ఓ పని చెయ్యండి... నేను ఓ మెసేజ్ మీకు పంపిస్తాను. దాన్ని నేను చెప్పిన నంబర్‌కి ఫార్వార్డ్ చెయ్యండి అన్నాడు. సరేనన్నాడు సాంబయ్య. మెసేజ్ రావడం, దాన్ని ఫార్వార్డ్ చెయ్యడం అన్నీ జరిగాయి. ఆ తర్వాత పావు గంటకు... సాంబయ్య బ్యాంక్ అకౌంట్ నుంచీ రూ.99,910 రూపాయలు మాయమయ్యాయి. షాకైన సాంబయ్య... వెంటనే పోలీసుల్ని కలిశాడు. కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రాసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదెలా సాధ్యమైంది ? : ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు. కిషోర్ పంపిన మెసేజ్‌లో వైరస్ లింక్ ఉండి ఉంటుంది. సాంబయ్య ఆ మెసేజ్‌ని ఫార్వార్డ్ చేసేందుకు ఓపెన్ చేసి ఉంటాడు. వెంటనే అందులోని వైరస్ బగ్... మొబైల్‌‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాతేముంది... మొబైల్‌లో కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, యాప్స్ ఇన్ఫర్మేషన్, ఐడీలు, పాస్‌వర్డ్‌లూ అన్నింటినీ కాపీ చేసి... కిషోర్‌కి పంపి ఉంటుంది. ఫలితంగా కిషోర్‌కి సాంబయ్య బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ తెలిసిపోయాయి. వెంటనే అకౌంట్ లోకి లాగిన్ అయ్యి... డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాడు.

పోలీసులు కనిపెట్టగలరా ? : ఇలాంటి కేసుల్ని కనిపెట్టడం చాలా కష్టం. ప్రధానంగా కిషోర్ లాంటి వాళ్లు ప్రాక్సీ సర్వర్లతో, బ్లాక్ చైన్ బ్రౌజర్లతో లాగిన్ అయి ఉంటే, ఎవరు లాగిన్ అయ్యారో, ఎక్కడి నుంచీ డబ్బు డ్రాచేశారో కనిపెట్టడం కష్టం. అందువల్ల ఇలాంటి ఉచ్చులో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాలి. బ్యాంక్ నుంచీ ఎవరు కాల్ చేశామని చెప్పినా, డైరెక్టుగా బ్యాంకుకే వెళ్లి డీల్ చేసుకోవడం మంచిది.

 ఇవి కూడా చదవండి :

కుక్క అనుకొని ఎలుగుబంటిని పెంచుకున్నాడు... ఆ తర్వాత ఏమైందంటే...

కేంద్రానికి కేజ్రీవాల్ షాక్... కేజ్రీవాల్‌కి ఢిల్లీ పోలీసుల షాక్...
Loading...
ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్ల కంపెనీపై సచిన్ కేసు.. 2 మిలియన్ డాలర్ల దావా...

40వేల ఏళ్ల నాటి తోడేలు తల... ఇప్పటికీ అలాగే ఉంది... సైబీరియా మంచులో...
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...