నర్సింగ్ స్టూడెంట్‌తో శృంగారం.. సీక్రెట్‌గా కెమెరా పెట్టి..

స్టూడెంట్‌ అయిన ఓ నర్సుతో శృంగారం చేయడమే కాకుండా.. ఆ పనిని సీక్రెట్‌గా కెమెరా పెట్టి వీడియో తీశాడో డాక్టర్. వాటితో ఆమెను ఇబ్బంది పెట్టి, డిగ్రీ కావాలంటే తనకు సుఖాన్ని అందించాలని ఒత్తిడి తెచ్చాడు.

news18-telugu
Updated: December 8, 2019, 4:59 PM IST
నర్సింగ్ స్టూడెంట్‌తో శృంగారం.. సీక్రెట్‌గా కెమెరా పెట్టి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గొప్ప వృత్తిలో ఉన్న వ్యక్తి అతడు.. నువ్వు! దేవుడయ్యా అంటూ చేతులెత్తి మొక్కుతారు.. వేలాది మంది ప్రాణాలు కాపాడాడు కూడా.. కానీ, నీచపు పని చేసి అడ్డంగా దొరికిపోయాడో డాక్టర్. స్టూడెంట్‌ అయిన ఓ నర్సుతో శృంగారం చేయడమే కాకుండా.. ఆ పనిని సీక్రెట్‌గా కెమెరా పెట్టి వీడియో తీశాడు. వాటితో ఆమెను ఇబ్బంది పెట్టి, డిగ్రీ కావాలంటే తనకు సుఖాన్ని అందించాలని ఒత్తిడి తెచ్చాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు 14 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకెళితే.. ఇంగ్లండ్‌లోని స్లాగ్ నగరానికి చెందిన గైనకాలజిస్టు జోమో మథురిన్(49) ఆస్పత్రిలోనే ఓ స్టూడెంట్ నర్సుతో అఫైర్ పెట్టుకున్నాడు. 2016లో ఇష్టపూర్వకంగానే ఇద్దరూ పలు సందర్భాల్లో సెక్స్‌లో పాల్గొన్నారు. అయితే.. ఆమెకు తెలీకుండా కళ్లజోడులో సీక్రెట్‌గా కెమెరా పెట్టి దాదాపు 40 నిమిషాల పాటు ఉన్న ఆ సన్నివేశాలను రికార్డు చేశాడు. ఆ తర్వాత కొన్ని సార్లు కూడా అలాగే చేశాడు. ఓ రోజు వాటన్నింటిని ఆమెకు చూపించి.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

ఆ వీడియోలు ఎందుకు తీశావని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో నువ్వు కొన్ని రిస్కులు తీసుకోవాలని, తనకు కావాల్సినంత సుఖాన్ని అందించాలని అన్నాడు. దీంతో.. విస్తుపోయిన ఆ యువతి ఏం చేయాలో పాలుపోక తనలో తానే కుంగిపోయింది. ఇంతలో జోమో నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి.. 15 ఫోటోలను, 96 వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. 2018 నుంచి కొనసాగుతున్న ఈ విచారణలో శనివారం తీర్పు వెలువడింది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>