Home /News /crime /

GYM TRAINER SIMULTANEOUS AFFAIR WITH MOTHER AND HER DAUGHTER FINALLY GONE THESE WRONG STEP SSR

Gym Trainer: జిమ్ ట్రైనర్‌తో ఆంటీ అఫైర్.. ఆమె కూతురితో కూడా ఈ కండలవీరుడి కక్కుర్తి పని.. చివరికి..

అర్చన రెడ్డి, నవీన్ కుమార్‌తో అర్చన రెడ్డి (ఫైల్ ఫొటో)

అర్చన రెడ్డి, నవీన్ కుమార్‌తో అర్చన రెడ్డి (ఫైల్ ఫొటో)

వివాహేతర సంబంధాలు కొంపముంచుతాయని తెలిసినా కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న నేరాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా క్షణిక సుఖాల మోజులో పడి బంగారం లాంటి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

ఇంకా చదవండి ...
    బెంగళూరు: వివాహేతర సంబంధాలు కొంపముంచుతాయని తెలిసినా కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న నేరాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా క్షణిక సుఖాల మోజులో పడి బంగారం లాంటి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. తల్లీకూతురితో అఫైర్ నడిపిన ఓ ప్రబుద్ధుడు చివరికి ఓ నిండు ప్రాణం తీశాడు.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జిగని ప్రాంతానికి చెందిన అర్చన రెడ్డి అనే మహిళ అరవింద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పదేళ్ల పాటు వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. వీరికి యువిక రెడ్డి, త్రివిద్ అనే అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అరవింద్‌తో మనస్పర్థలు రావడంతో అతనికి దూరమైన అర్చన సిద్ధిక్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల క్రితం ఇతనితో కూడా సరిపడక విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు నవీన్ కుమార్ అనే జిమ్ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది. నవీన్ జిమ్ ట్రైనర్ మాత్రమే కాదు బాడీ బిల్డర్ కూడా. జిమ్‌లో అతనితో పెరిగిన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. నాలుగేళ్ల నుంచి వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తోంది. అర్చన కూతురు యువికతో కూడా నవీన్‌కు పరిచయం ఏర్పడింది.

    ఇది కూడా చదవండి: Newly Married: పెళ్లయి రోజులు కూడా గడవలేదు.. ఇద్దరూ బైక్‌పై అత్తగారింటికి వెళుతున్నారు.. యాక్సిడెంట్ కాదు.. కానీ..

    ఆమెకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఇలా యువిక కూడా నవీన్‌కు దగ్గరైంది. ఇద్దరి మధ్య అఫైర్ నడిచింది. ఇలా తల్లికి తెలియకుండా కూతురితో, కూతురికి తెలియకుండా తల్లితో నవీన్ కుమార్ వివాహేతర సంబంధం కొనసాగించాడు. కొన్నాళ్లకు నవీన్ అర్చన రెడ్డి ప్రాపర్టీపై కన్నేశాడు. గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన అర్చన రెడ్డి బాగానే సంపాదించింది. నవీన్‌ను పెళ్లి చేసుకోవాలని కూడా భావించింది. కానీ.. నవీన్ మాత్రం అర్చన రెడ్డి కూతురు యువికకు దగ్గరై ఈమెను నిర్లక్ష్యం చేశాడు. కొన్నిరోజులకు తన కూతురితో నవీన్ ప్రేమాయణం సాగిస్తున్న సంగతి అర్చనకు తెలిసింది.

    ఇది కూడా చదవండి: OMG: ఒకప్పుడు ‘బతుకు జట్కా బండి’ లాంటి షోలో కనిపించిన ఈ మహిళ.. ఇప్పుడు..

    ఇది కరెక్ట్ కాదని అతనిని హెచ్చరించింది. అయినప్పటికీ ఆమె వార్నింగ్‌ను లెక్క చేయకుండా నవీన్ యువికకు మరింత దగ్గరయ్యాడు. దీంతో.. నవంబర్ 11న నవీన్‌పై జిగని పోలీస్ స్టేషన్‌లో అర్చన ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు అతనిని స్టేషన్‌కు పిలిపించి మరోసారి అర్చన వాళ్లింటికి వెళితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. ఈ పరిణామం జరిగిన రోజుల వ్యవధిలోనే నవీన్, యువిక కలిసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. పోలీసుల సాయంతో తన కూతురి బ్యాంకు ఖాతాను అర్చన రెడ్డి బ్లాక్ చేయించింది. తనకు తెలిసిన ఓ గూండాతో నవీన్‌కు వార్నింగ్ ఇప్పించాలని ఆమె భావించింది.

    ఇది కూడా చదవండి: Sad Incident: ‘రాజారాణి’ సినిమాలో జరిగినట్టే జరిగింది.. పెళ్లై రెండు నెలలు కూడా గడవక ముందే..

    యువికకు దూరంగా ఉండకపోతే నిన్ను చంపేస్తానని ఆ గూండా నవీన్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ క్రమంలోనే.. అర్చన రెడ్డిని చంపేయాలని నవీన్ భావించాడు. అనూప్ అనే మరో వ్యక్తి సాయంతో ఆమె హత్యకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం.. నవీన్, అనూప్ కలిసి అర్చనను చంపేశారు. యువికకు కూడా తల్లిని హత్య చేయనున్నట్లు తెలుసు. కానీ.. నవీన్ మోజులో ఆమె వద్దని చెప్పకుండా ఉండిపోయింది. అర్చన కొడుకు ఫిర్యాదుతో నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్‌తో పాటు ఉన్న అర్చన కూతురు యువికను పోలీసులు విచారించగా.. ఈ హత్య నవీన్ చేసినట్లు ఆమె చెప్పింది. ఆస్తి కోసం అర్చన హత్య జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనూప్, నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సంతోష్ అనే మరో వ్యక్తి కూడా హత్యకు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలా.. వివాహేతర సంబంధం మూలంగా అతనే సర్వస్వం అని ఎవరినైతే అర్చన నమ్మిందో.. పెళ్లి చేసుకోవాలని భావించిందో అతని చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bangalore, Extra marital affair, Gym

    తదుపరి వార్తలు