కోచ్‌కు కోపం వచ్చి... కుక్కమీద కాల్పులు...

హైదరాబాద్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ జిమ్ కోచ్‌కు కోపం వచ్చి కుక్కను కాల్చి చంపాడు.

news18-telugu
Updated: December 22, 2019, 7:17 PM IST
కోచ్‌కు కోపం వచ్చి... కుక్కమీద కాల్పులు...
కుక్క (File)
  • Share this:
హైదరాబాద్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ జిమ్ కోచ్‌కు కోపం వచ్చి కుక్కను కాల్చి చంపాడు. హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సరూర్‌ నగర్‌లోని బాపు నగర్‌లో అవినాష్ కరణ్ అనే వ్యక్తి జిమ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి వద్ద తిరుగుతున్న కుక్క మీద ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో కుక్క చనిపోయింది. ఈ ఘటనపై సదరు కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో వీధికుక్కలు జనం మీద పడి కరుస్తున్నాయి. వాహనాల వెంట పడడం, కార్ల వెనుక పరిగెత్తడం, ద్విచక్ర వాహనదారులు, పాదచారుల మీద పడి కరుస్తున్నాయి. ఈ కుక్క అవినాష్‌కు సంబంధించిన ఎవరినైనా కరిచిందా? లేకపోతే కేవలం అరుస్తుందన్న కారణంతోనే చంపేశాడా? లేకపోతే ఆ కుక్క యజమానికి, అవినాష్‌కు మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా? అనేది పోలీసులు విచారిస్తున్నారు.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు