Home /News /crime /

GYANVAPI MASJID CASE ADVOCATE REPRESENTING ANJUMAN INTEZAMIA MASJID COMMITTEE DIES OF HEART ATTACK PVN

Gyanvapi Masjid case : జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో బిగ్ ట్విస్ట్..ముస్లింల తరపున లాయర్ మృతి

జ్ఞానవాపి మసీదు(ఫైల్ ఫొటో)

జ్ఞానవాపి మసీదు(ఫైల్ ఫొటో)

Gyanvapi Masjid case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వారాణసి నగరంలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో(Gyanvapi Masjid Case)అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు.

ఇంకా చదవండి ...
Gyanvapi Masjid case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వారాణసి నగరంలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో(Gyanvapi Masjid Case)అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు. అభయ్ నాథ్ కు ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గుండెపోటు రావ‌డంతో ఆయ‌నను వెంట‌నే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ఆయ‌నను ప‌రీక్షించిన డాక్టర్లు మార్గ‌మ‌ధ్యంలోనే చ‌నిపోయినట్టు ప్ర‌క‌టించారు. జ్ఞాన్‌వాపి కేసు,శృంగార్ గౌరీ కేసులలో అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు ముగించాయి. అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4న ముస్లిం వైపు నుండి అలహాబాద్ హైకోర్టులో ప్రత్యుత్తరం సమర్పించవలసి ఉండగా, ఆకస్మికంగా న్యాయవాది మరణించారు. ఈ కేసులో న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ పాత్ర ముఖ్యమైనది.

జ్ఞాన్వాపి కేసును లోయర్ కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై అక్టోబర్ లో సుప్రీంకోర్టు విచారణ జరపాల‌ని నిర్ణ‌యించింది. ప్రస్తుతం దిగువ కోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నరసింహలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. సీనియర్ న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ ఆక‌స్మిక మరణించడంపై బనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



గన్ పట్టుకున్నోడికి గన్ తోనే సమాధానం..మన్మోహన్ తీరుపై తమిళనాడు గవర్నర్ హాట్ కామెంట్స్

అంతకుముందు, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ ను బెదిరిస్తూ అతనికి..చేతితో రాసిన బెదిరింపు లేఖ వచ్చింది. ఆ తర్వాత అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), వారణాసి పోలీస్ కమిషనరేట్‌కు రాసిన లేఖలో దివాకర్... ఇస్లామిక్ ఆగాజ్ ఉద్యమం తరపున కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖీ రాసినట్లు భావిస్తున్న లేఖ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తనకు అందిందని చెప్పారు. న్యాయమూర్తికి లేఖ అందినట్లు వారణాసి పోలీస్ కమిషనర్ ఎ సతీష్ గణేష్ ధృవీకరించారు. న్యాయమూర్తి భద్రత కోసం మొత్తం తొమ్మిది మంది పోలీసులను నియమించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gyanvapi Masjid case

తదుపరి వార్తలు