Home /News /crime /

GWALIOR YOUTH COMPLAINS TO SSP AMIT SANGHI MY WIFE IS BEATING ME BY THROWING CHILLI POWDER IN EYES SK

నా భార్య.. కంట్లో కారంపోసి కొడుతోంది.. ప్లీజ్ కాపాడండి.. ఈ భర్త కష్టాలు ఎవరికీ రాకూడదు

బాధితుడు సంజయ్

బాధితుడు సంజయ్

Crime News: తన భార్య తనను టార్చర్ పెడుతోందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. కంట్లో కారం పోసి కొట్టిందని..తను మీరే కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

    భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. దాదాపు ప్రతి ఇంట్లో ఇలాంటి ఉంటాయి. కానీ చిన్నచిన్న గొడవలే ఒక్కోసారి పెద్దవై.. కాపురాలు కూల్చుకునే వరకు వెళ్తుంటాయి. చివరకు పోలీస్ స్టేషన్‌లు, కోర్టు వరకు చేరుతాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా భర్తలు కొట్టారని భార్యలు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఇక్కడ రివర్స్‌లో జరిగింది. భార్య కొట్టిందని.. ఓ భర్త (Wife and husband Fight) ఫిర్యాదు  చేశాడు. కంట్లో కారంపోసి కొట్టిందని.. ఆమె నుంచి కాపాడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అత్తింటి వారితో వేగలేకపోతున్నానని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరాడు.

    Lover: గోపీ నువ్వురాసిన లేఖతో ఆ ఆమ్మాయి మనసు కరుగుతుంది కానీ.., నువ్వు ఇక లేవంటే నమ్మగలదా.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్‌కు గ్వాలియర్‌లోని మహల్‌గావ్ ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. సంజయ్ మలాన్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్‌గా పనిచేసేవాడు. పెళ్లయిన కొన్ని రోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఏం జరిగిదో ఏమో గానీ.. ఆ తర్వాత క్రమంగా విభేదాలు తలెత్తాయి. అత్తింటి వారిని పూజ అస్సులు గౌరవించేది కాదట. ఇంట్లో పనులు కూడా చేసేది కాదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. మూడు నెలల క్రితం అతడు ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో మే 31న సంజయ్ తల్లిదండ్రులను పూజ తిట్టిందట. మీ పేరెంట్స్ మంచి వారు కాదని అనడంతో సంజయ్‌కి కోపమొచ్చింది. భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని తిట్టాడు. అనంతరం పూజను గ్వాలియర్‌లోని తన పుట్టింట్లో దింపడానికి వెళ్లాడు.

    Shocking: పింపుల్స్ తగ్గటం లేదని యువతి అఘాయిత్యం.. ఇంటిలో ఎవరులేనిది చూసి..

    సంజయ్ తన అత్తింటికి వెళ్లాక.. గొడవ మరింత పెద్దదయింది. తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి తన భర్త సంజయ్‌పై దాడి చేసింది పూజ. సంజయ్‌పై ఇటుకలతో కొట్టడమే కాకుండా.. కంట్లో కారం చల్లారు. అందరూ కలిసి సంజయ్‌ను చితకబాదారు. ఈ ఘటన అనంతరం అతడు నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. నా భార్య కంట్లో కారంపోసి కొట్టింది.. ఆమె నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. సంజయ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులను విచారిస్తున్నారు. ఒకవేళ వారు తప్పు చేశారని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ అమిత్ సంఘీ పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు