హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

భర్త,అత్తని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో..తర్వాత పలువురితో వివాహేతర సంబంధం..చివరికి

భర్త,అత్తని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో..తర్వాత పలువురితో వివాహేతర సంబంధం..చివరికి

నిందితురాలు బందోనా

నిందితురాలు బందోనా

woman brutally murders husband and mother in law : దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని ఆమె ప్రియుడు అప్తాబ్ ముక్కలుగా నరికిన తరహా కేసు మరొకటి అసోంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో గౌహతి(Guwahati)లో ఒక హత్య జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

woman brutally murders husband and mother in law : దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్(Shraddha walker) అనే అమ్మాయిని ఆమె ప్రియుడు అప్తాబ్ ముక్కలుగా నరికిన తరహా కేసు మరొకటి అసోంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో గౌహతి(Guwahati)లో ఒక హత్య జరిగింది. ఓ మహిళ .. తన భర్త, అత్తను హత్య చేసి ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్​లో పెట్టింది. హత్య చేసిన మూడు రోజుల తర్వాత మృతదేహాలను మూటగట్టి అసోం-మేఘాలయ బోర్డర్ లో ఓ లోయలో పడేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి పేరు బందొనా కలిత(Bondona Kalita)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన ప్రకారం..బందొనా కలిత(Bondona Kalita)-అమర్ జ్యోతి దేయ్(Amarjyoti Dey)భార్యాభర్తలు. వీరు గౌహతిలోని నూన్మతి ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే బందోనాకి చాలామందితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన భర్త,అత్తను చంపి ఆ ఆస్తితో తాను ఎంజాయ్ చేయాలన్న ఆలోచన బందోనాకి వచ్చింది. దీంతో తనతో వివాహేతర సంబంధంలో ఉన్న అరుప్ దేకా,మరో ఫ్రెండ్ దంజిత్ దేకాతో తన ఆలోచన పంచుకుంది. వారిద్దరి సహాయంతో గతేడాది ఆగస్టులో తన భర్త,అత్తను హత్య చేసి డెడ్ బాడీలను ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టింది. మూడు రోజుల తర్వాత అసోం-మేఘాలయ సరిహద్దు ప్రదేశంలో ఆ శరీర భాగాలను విడివిడిగా వేర్వేరు ప్రదేశాల్లో విసిరేసింది.

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు..దేశాల కీర్తిని పెంచిన వీటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

అయితే తమవాళ్లు కనపించడం లేదంటూ అమర్ జ్జోతి కుటుంబసభ్యులు గతేడాది ఆగస్టులో పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చారు. మిస్పింగ్ కంప్లెయింట్ గా కేసును విచారణ ప్రారంభించారు పోలీసులు. అయితే పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టి బందోనాకి చాలా మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.ఇన్నాళ్లిటికి పాపం పండటంతో పోలీసులు తమ స్టైల్ లో విచారించగా బందోనా నిజం ఒప్పసుకుంది. దీంతో బందోనా,ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని గౌహతి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇక,ఆమె తన భర్త,అత్త శరీరభాగాల్ని పడేసిన చోటుకి వెళ్లి ఆ భాగాల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

First published:

Tags: Assam, Brutally murder, Crime news, Wife kill husband

ఉత్తమ కథలు