హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: మేన మామ అని నమ్మి ఇంటికి వెళ్లింది... బాలికను గదిలోకి తీసుకెళ్లి..

Shocking: మేన మామ అని నమ్మి ఇంటికి వెళ్లింది... బాలికను గదిలోకి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం కోసం రోజు బయటకు వెళ్లేవారు. అప్పుడు బాలిక తెలిసిన వాడే కదా అని తన మేన మామ ఇంటికి వెళ్లేది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కామాంధులు మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతునే ఉన్నారు. కొన్నిచోట్ల మానవ సంబంధాలను కూడా కాలరాస్తున్నారు. పశువులకన్న కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు, అమ్మాయిలు అఘాయిత్యాలకు పాల్పడుతున్న అనేక ఘటనలల్లో తెలిసిన వారి చేతిల్లోనే మోసాలకు గురౌతున్నారు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో మహిళలు అత్యాచారాలకు గురౌతున్నారు. కొందరు చాక్లెట్ ఇస్తామని, మరికొందరు నమ్మించి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల.. కన్నవారు, సోదరులు, బంధువులు కూడా అత్యాచారాలుచేస్తున్న అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.


పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆమె పదవతరగతి చదువుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు ఇంటి దగ్గరు ఉంచి, ఉద్యోగానికి వెళ్లేవారు. అయితే.. ఆమె ఇంటికి సమీపంలో ఆమె మేనమామ ఉండేవాడు. అతను ఉత్తరాఖండ్ కు చెందిన వాడు. ప్రతిరోజు ఆమెను ఏదో ఒకసాకుతో ఇంటికి పిలిచి, అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత ఎవరికైన చెబితే చంపేస్తానని అనేవాడు. అయితే.. బాలిక భయంతో చెప్పకుండా ఉండిపోయింది.కొన్నిరోజులుగా బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పడు ఆమె గర్భవతి అని తెలిపారు. అంతేకాకుండా ఆమెకు నొప్పులు వచ్చి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాలిక, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.


ఇదిలా ఉండగా క్లాస్ లో బాలిక పట్ల టీచర్ అమానుషంగా ప్రవర్తించింది.


మిజోరాంలోని (Mizoram)  లుంగ్లీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. తంగ్ పుయ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో.. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని యూనిఫామ్ అను అదే పాఠశాలకు చెందిన టీచర్ విప్పించింది. కేంద్రం యొక్క సర్వశిక్షా అభియాన్ కింద రిక్రూట్ చేయబడిన లాల్బియాకెంగిగా గుర్తించబడిన కాంట్రాక్టు మహిళా టీచర్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. బాలికను, తోటి విద్యార్థి గాయపర్చాడు. దీంతో ఆమెను కొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆ తర్వాత... మరోసారి స్కూల్ కు పంపించగా, అతను దాడిచేశాడు. దీంతో బాలిక తల్లి, స్కూల్ కు వచ్చి, ఆ బాలుడిని తిట్టింది.


దీంతో స్కూల్ టీచర్.. కోపంతో బాలిక తల్లికి కాల్ చేసింది. ఇలా చేయడం సరికాదని చెప్పింది. ఈ క్రమంలో కోపంతో బాలిక తల్లి.. పాఠశాలకు వచ్చింది. తన కూతురుని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. అయితే.. స్కూల్ యూనిఫామ్ తీసేసి.. బాలికను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని టీచర్ తెగేసి చెప్పింది. దీంతో వేరమార్గం లేక బాలిక దుస్తులు తీసేసి, కేవలం లోదుస్తుల మీదనే ఆమె తను కూతురుని ఇంటికి తీసుకెళ్లింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Haryana

ఉత్తమ కథలు