Home /News /crime /

GURUGRAM MAN ROBBED AT GUNPOINT ON PRETEXT OF ASKING ADDRESS IN HARYANA NK

వామ్మో... ఈమధ్య ఇలా కూడా దోచేస్తున్నారా... అడ్రెస్ అడిగి... గన్ పెట్టి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana Crime : మిమ్మల్ని ఎవరైనా అడ్రెస్ అడిగితే... వెంటనే చెప్పేయవద్దు. అసలు అడిగిన వాళ్లు ఎలాంటి వాళ్లో జాగ్రత్తగా ఉండమంటోంది ఈ క్రైమ్ కేసు.

అది గుర్గావ్‌... శాంతినగర్‌లోని సివిల్ లైన్స్ దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్ ఏరియా. ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై జనం లేరు. 32 ఏళ్ల ఆ బాధితుడు తన ఫ్రెండ్‌ని కలిసేందుకు... రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు అతని వెనకే వచ్చి... పక్కనే మెల్లగా ఆగింది. అందులో ముగ్గురున్నారు. వారిలో ఒకడు విండో గ్లాస్ తీసి... కొంచెం ఈ అడ్రెస్ ఎక్కడో గూగుల్ మ్యాప్‌లో చూపిస్తారా అన్నాడు. అది చూసిన బాధితుడు... తన మొబైల్ తీసి... గూగుల్ మ్యాప్‌లో అడ్రెస్ చూపించేందుకు ప్రయత్నిస్తుండగా... ముగ్గురిలో ఒకడు వెనక సీటు నుంచీ కారు దిగాడు. బాధితుడి పక్కన నిలబడి... సీక్రెట్‌గా గన్ తీసి.... అతని పొట్టలోకి గురిపెట్టాడు.

గన్ చూడగానే బాధితుడు కంగారు పడ్డాడు. సైలెంట్‌గా కారు ఎక్కు అన్నాడు గన్ పెట్టిన వ్యక్తి... చుట్టూ దిక్కులు చూస్తూ. బాధితుడు భయపడుతూనే కారు వెనక సీటులో ఎక్కి కూర్చున్నాడు. అంతే అతని జేబులన్నీ చెక్ చేసి... పర్సు, సెల్‌ఫోన్, చేతి ఉంగరం లాక్కున్నారు. ఆ పర్సులో రూ.6000 ఉన్నాయి. అతని దగ్గర ఇంకేవీ లేవని తెలిశాక... సైలెంట్‌గా కారు దిగి వెళ్లిపో... అరిచావో చచ్చావే అని బెదిరించాడు. ప్రాణభయంతోనే ఆ బాధితుడు కారు దిగాడు. మరు క్షణంలో కారు రయ్యిన దూసుకుపోయింది.

ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాల ముందే... ఆ బాధితుడు దగ్గర్లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నాడు. అది చూసిన కేటుగాళ్లు వెనకాలే ఫాలో అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్లెవరు, ఇంతకు ముందు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారా అన్నది పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 397 ప్రకారం దోపిడీ, బెదిరింపు కేసు నమోదైంది.

 

ఇవి కూడా చదవండి :

కే ఏ పాల్ సంధించిన షాకింగ్ ప్రశ్నలు... కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పగలదా?

రూ.1,50,00,000 పట్టివేత... తమిళనాడులో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

రూ.4,62,00,000 ఆస్తులు, ఆయుధాలు... రాజ్‌నాథ్ నామినేషన్‌లో వివరాలు ఇవీ...

పళనిస్వామి డబ్బులు పంచారా... సోషల్ మీడియాలో దుమారం... ఇదీ వాస్తవం
First published:

Tags: Crime, Haryana, Murder

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు