ఎస్ఎంఎస్‌లో లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ నుంచి రూ.60 వేలు మాయం

లింక్ క్లిక్ చేయగానే తన ప్రమేయం లేకుండా ఓ యాప్ ఇన్‌స్టాల్ అయింది. తెల్లారేసరికి బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ.60,000 డిడక్ట్ అయ్యాయి.

news18-telugu
Updated: February 9, 2019, 8:17 AM IST
ఎస్ఎంఎస్‌లో లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ నుంచి రూ.60 వేలు మాయం
ఎస్ఎంఎస్‌లో లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ నుంచి రూ.60 వేలు మాయం
  • Share this:
సైబర్ నేరాలపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు ఎన్ని రకాలుగా అప్రమత్తం చేసినా... జనం అమాయకంగా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. మారుమూల గ్రామాల్లోనే కాదు... దేశరాజధాని న్యూ ఢిల్లీలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. గురుగ్రామ్‌లో ఓ వ్యక్తికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేశాడు. కానీ తెల్లారేసరికి అతని అకౌంట్ నుంచి రూ.60 వేలు మాయమయ్యాయి.

లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ నుంచి డబ్బులెలా మాయమౌతాయని మీకు డౌట్ వచ్చిందా? సైబర్ నేరగాళ్లు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. మీరు అజాగ్రత్తగా ఉంటే ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ అతని పేరు హరీష్ చందర్. వయస్సు 52 ఏళ్లు. వ్యాపారం చేస్తున్నాడు. తన ఫోన్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ పెండింగ్‌లో ఉందన్నది ఆ మెసేజ్ సారాంశం. నిజంగానే ఐటీ డిపార్ట్‌మెంట్ పంపిన ఎస్ఎంఎస్ కావచ్చని అనుకున్నాడు. అందులో ఉన్న లింక్ క్లిక్ చేయగానే తన ప్రమేయం లేకుండా ఓ యాప్ ఇన్‌స్టాల్ అయింది. తెల్లారేసరికి బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ.60,000 డిడక్ట్ అయ్యాయి.

Read this: Save Money: జీతం మొత్తం ఖర్చయిపోతుందా? డబ్బు ఆదా చేయడానికి 5 టిప్స్

cyber crime, itr refund fake sms, itr refund fake email, itr refund scam, itr refund cheating, సైబర్ క్రైమ్, ఐటీఆర్ రీఫండ్ స్కామ్, ఐటీఆర్ రీఫండ్ ఎస్ఎంఎస్తెల్లారేసరికి అకౌంట్‌లో రూ.60,000 మాయమయ్యేసరికి హరీష్ చందర్ కంగారుపడ్డాడు. వెంటనే గురుగ్రామ్‌లోని సెక్టార్ 10 పోలీసుల్ని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఎవర్ని అరెస్ట్ చేయలేదు. ఇలా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, ట్యాక్స్ రీఫండ్ చేస్తామని ఎస్ఎంఎస్‌లు, ఇమెయిల్స్ పంపి జనాన్ని ముంచేస్తున్న ఘటనలు చాలాకాలంగా జరుగుతున్నవే. ఎస్ఎంఎస్, ఇ-మెయిల్స్‌లో ఉండే లింక్స్‌పై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. అంతేకాదు... ఇలా అకౌంట్ల నుంచి డబ్బులు కాజెయ్యడం సైబర్ నేరగాళ్లకు సులువవుతుంది.

ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేసేవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో వచ్చే ఎస్ఎంఎస్, ఇమెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. bit.ly, goo.gl, ow.ly, t.co లాంటి యూఆర్ఎల్ షార్టెనర్స్‌తో ఫిషింగ్ లింక్స్ వస్తుంటాయి. వాటిని పట్టించుకోకపోవడమే మంచిది. క్లిక్ చేస్తే బుక్కైపోతారు. పొరపాటున కూడా అలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు. అలాంటి ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్‌లో స్పెల్లింగ్‌తో పాటు వ్యాకరణ దోషాలుంటాయి కాబట్టి వాటిని గుర్తించొచ్చు. మీకు తెలిసినవారి నుంచి అలాంటి ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్‌ వచ్చినా పట్టించుకోకపోవడం మంచిది. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ వివరాల్లాంటి మీ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని అస్సలు ఎంటర్ చేయొద్దు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులెవరూ వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్, పిన్, ఓటీపీ లాంటివి అడగరు. కంప్యూటర్, మొబైల్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఫైర్‌వాల్ ఉపయోగించాలి. మళ్లీ మళ్లీ అలాంటి ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్‌ వస్తే phishing@incometax.gov.in ఇ-మెయిల్‌కు ఫార్వర్డ్ చేయొచ్చు. ఓ కాపీని incident@cert-in.org.in కు కూడా పంపాలి. ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఇ-మెయిల్ డిలిట్ చేయండి.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...
Loading...


ఇవి కూడా చదవండి:

IRCTC Ticket Booking: రిజర్వేషన్ సమయంలో ఈ 8 విషయాలు గుర్తుంచుకోండి

PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31

SHOCK: మీకు తెలియకుండా స్క్రీన్‌ని రికార్డ్ చేస్తున్న ఐఫోన్ యాప్స్
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...