మసాజ్ సెంటర్ ముసుగులో సెక్స్ దందా...విదేశీ వనితలతో వ్యభిచారం..

ఓ మహిళ ఆధ్వర్యంలో ఈ దందాను నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి నగదు అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

news18-telugu
Updated: January 18, 2020, 10:48 PM IST
మసాజ్ సెంటర్ ముసుగులో సెక్స్ దందా...విదేశీ వనితలతో వ్యభిచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మసాజ్ సెంటర్ ముసుగులో యువతులను వ్యభిచార కూపంలోకి లాగుతున్న ఘటన హర్యానాలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో విటులకు అమ్మాయిల ఫోటోలు పంపి, వ్యభిచార దందా సాగిస్తున్న ఉదంతాన్ని హర్యానా పోలీసులు చేధించారు. వీరిలో విదేశీ వనితలు కూడా వుండటం మరింత ఆందోళన రేపింది. వివరాల్లోకి వెళితే గురుగ్రాం పరిధిలోని రాజ్ ప్లాజాలోని పలు మసాజ్ సెంటర్లలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు సహా, మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. యువతుల ఫోటోలను మొబైల్ యాప్స్ ద్వారా సోషల్ మీడియాలో వేసి నగరంలోని విటులను మసాజ్ సెంటర్లకు ఆహ్వానించి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఓ మహిళ ఆధ్వర్యంలో ఈ దందాను నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి నగదు అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు