గొంతు కోసి భార్యా పిల్లల హత్య.. ఆపై తనూ ఆత్మహత్య..

ఘటనా స్థలంలో 'కుటుంబాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను' అని ఆత్మహత్యకు ముందు ప్రకాష్ సింగ్ రాసినట్టుగా పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: July 1, 2019, 4:58 PM IST
గొంతు కోసి భార్యా పిల్లల హత్య.. ఆపై తనూ ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలోని గుర్గావ్‌లో ఓ కెమికల్ ఇంజనీర్ తన భార్యా, పిల్లలను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.అనంతరం తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో.. అనుమానం
వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. నలుగురి మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను ప్రకాష్ సింగ్(55), అతని భార్య, కుమార్తె (22),కుమారుడు(13)గా గుర్తించారు.

ఘటనా స్థలంలో 'కుటుంబాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను' అని ఆత్మహత్యకు ముందు ప్రకాష్ సింగ్ రాసినట్టుగా పోలీసులు తెలిపారు.అయితే అది రాసింది ప్రకాషేనా? కాదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా, పీహెచ్‌డీ చేసిన ప్రకాష్.. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఎనిమిదేళ్లుగా గుర్గావ్‌లో ఉంటున్నాడు. అతని భార్య సొంతంగా ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తోంది. ఆర్థికంగా ప్రకాష్ కుటుంబం బాగానే ఉన్నప్పటికీ.. ఏ విషయంలో వీరికి గొడవలు వచ్చాయో తెలియాల్సి ఉంది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు