• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • GUNTURU POLICE ARRESTED BLADE BATCH IN TADEPALLI PRN

Extra Marital Affair : వీడిన బ్లేడ్ బ్యాచ్ మిస్టరీ... వివాహేతర సంబంధమే కారణమా..?

Extra Marital Affair : వీడిన బ్లేడ్ బ్యాచ్ మిస్టరీ... వివాహేతర సంబంధమే కారణమా..?

ప్రతీకాత్మిక చిత్ర

గుంటూరు జిల్లా తాడేపల్లిలో మిస్టరీగా మారిన బ్లేడ్ బ్యాచ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడిపై ప్రియురాలే దాడి చేయించినట్లు తేల్చారు.

  • Share this:
    గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన బ్లేడ్ బ్యాచ్ దాడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా నిర్ధారించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఏటాక్ పై సీరియస్ గా దృష్టి పెట్టిన పోలీసులు ఒక్కరోజులోనే అసలు విషయం తేల్చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సురేష్ అనే వ్యక్తిని ఎర్రచందనం మొక్కలు కావాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో అతను తాడేపల్లిలో వారిని కలిసేందుకు వెళ్లాడు. అనంతరం వారు తమ దగ్గరున్న బ్లేడ్లతో సురేష్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన సురేష్ దగ్గర నుంచి బంగారం, నగదు, సెల్ ఫోన్ అపహరించుకుపోయారు. తనపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినట్లు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో దాడి చేసిన వారిని పట్టుకున్నారు.

    ప్రియురాలే చేయించిందా..?

    పోలీసుల దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా తేలింది. ఇందులో బ్లేడ్ బ్యాచ్ కోణమే లేదని పోలీసులు స్పష్టం చేశారు. సురేష్ కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఆమెను తరచూ వేధిస్తుండటంతో అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేసింది. తెలిసిన వారి ద్వారా తెనాలికి చెందిన కిరాయి ముఠాకు డబ్బులిచ్చి సురేష్ పై దాడి చేయించింది.

    దొరికారిలా..!

    దాడికి పాల్పడ్డ వారి వివరాలు సురేష్ కు తెలియకపోవడం, వారి ఫోన్ నెంబర్లు కూడా గుర్తు లేకపోవడంతో ఐటీ టీమ్ ద్వారా కూపీ లాగారు. సురేష్ సెల్ ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలించి.. దాడి చేయడానికి ముందు వచ్చిన చివరి ఫోన్ కాల్ టవర్ లొకేషన్లను ట్రేస్ చేశారు. ఫోన్ నెంబర్ తెనాలికి చెందిన యువకుడిదిగా గుర్తించి అతన్ని విచారించారు. ఆ యువకుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ విచారణలో తామే దాడి చేసినట్లు నిందితులు అంగీకరించారు. బ్లేడ్ బ్యాచ్ మాటున ప్రియుడిపై దాడి చేయించిన మహిలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు