గుంటూరులో దారుణం.... వడ్డీ డబ్బులు అడిగినందుకు...

అయితే తన అప్పు చెల్లించాలని కృష్ణ ప్రసాద్‌ తరచూ గోపీకృష్ణను అడుగుతున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన గోపీకృష్ణ అతడి హత్యకు ప్లాన్ చేశాడు.

news18-telugu
Updated: November 25, 2019, 9:41 AM IST
గుంటూరులో దారుణం.... వడ్డీ డబ్బులు అడిగినందుకు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు అతడ్ని మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గరికపాడులో జరిగింది. గోపికృష్ణ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం కృష్ణప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే తన అప్పు చెల్లించాలని కృష్ణ ప్రసాద్‌ తరచూ గోపీకృష్ణను అడుగుతున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన గోపీకృష్ణ అతడి హత్యకు ప్లాన్ చేశాడు. మద్యం తాగుదాం రమ్మని కృష్ణ ప్రసాద్‌ను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే అర్థరాత్రి కొట్టి చంపేశాడు. అనంతరం వెళ్లి పోలీసుల క్రొసూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

మృతుడు కృష్ణ ప్రసాద్
Published by: Sulthana Begum Shaik
First published: November 25, 2019, 9:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading