హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: ప్రేమించిన అమ్మాయిని లాడ్జిలో బంధించిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Andhra Pradesh: ప్రేమించిన అమ్మాయిని లాడ్జిలో బంధించిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guntur: తన ప్రేమను ఒప్పుకోని అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని యువకుడు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో చేసిన పని కటకటాల పాలు చేసింది.

  అతడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ అమ్మాయి మాత్రం పట్టించుకోలేదు. అదేపనిగా అమ్మాయి వెంట పడుతుంటే తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు మందలించి పంపేశారు. ఐతే అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని భావించాడు. బలవంతంగా యువతి మెడలో తాళి కట్టేందుకు యత్నించాడు. ఐతే అతడ్ని నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని కొత్తపేటకు చెందిన యువతి ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గతంలో ఆమె కుటుంబం సంగడిగుంటలోలో నివాసం ఉండేంది. అదే ప్రాంతంలో ఉండే వెంకటేశ్వరరావు.. ఆమెను ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి.. ఓ రోజు తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వెంకటేశ్వరరావుతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించిన యువతి తల్లిదండ్రులు వారిని మందలించారు. దీంతో ఆమె వెంటపడనని.. ఇంకోసారి ఇలా చేయనని పెద్దల సమక్షంలో అంగీకరించాడు. ఐతే ఆమెపై ప్రేమను చంపుకోలేకపోయిన వెంకటేశ్వరరావు ఎలాగైనా దక్కించుకోవాలని భావించాడు.

  ఈక్రమంలో మంగళవారం నాజ్ జంక్షన్లో కాలేజీకి వెళ్లిస్తున్న యువతిని.. వెంకటేశ్వరరావు అడ్డగించాడు. ఓసారి మాట్లాడాలి రావాలంటూ ఆమెను బైక్ ఎక్కించొని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడే బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో అసలు విషయాన్ని పసిగట్టిన యువతి... అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వరరావు కోసం గాలిస్తున్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

  గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎలూరుకు చెందిన ఓ యువతి.. మరో యువకుడితో స్నేహం చేసింది. అదే అదునుగా భావించిన అతడు.. ద్వారాకా తిరుమల తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇద్దరు స్నేహితుల సాయంతో యువతిని బైక్ ఎక్కించుకొని ద్వారా తిరుమల తీసుకెళ్లాడు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పెళ్లికి సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేస్తుండగా అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. యువతి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువకులు.. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడటం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు పడొద్దని సూచిస్తున్నారు. అమ్మాయిలు అంగీకరించకుంటే వారి నిర్ణయాన్ని గౌరవించి వెంటపడటం మానుకోవాలంటున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Lovers

  ఉత్తమ కథలు