గుంటూరు ప్రేమజంట దాడి కేసులో ట్విస్ట్.. ప్రియుడి స్నేహితులే నిందితులు

ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అక్కడకు చేరుకున్న శ్రీనివాస్ స్నేహితులు... ఇద్దరిపై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మరణించింది.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 10:40 AM IST
గుంటూరు ప్రేమజంట దాడి కేసులో ట్విస్ట్.. ప్రియుడి స్నేహితులే నిందితులు
నమూనా చిత్రం
  • Share this:
గుంటూరు  జిల్లాలో జరిగిన ప్రేమ జంట దాడి కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ట్రేస్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రియుడి స్నేహితులేనని తేల్చారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అక్కడకు చేరుకున్న శ్రీనివాస్ స్నేహితులు... ఇద్దరిపై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు.

శ్రీనివాసరావు స్నేహితులే ఈ దారుణానికి తెగబడ్డారంటూ, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరి సెల్ ఫోన్ డేటా, కాల్ లిస్ట్ ఆధారంగా వెంటనే నిందితులెవరో గుర్తించారు. నిందితులిద్దరూ బైక్‌పై వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పొలీసులు.. వారిని పట్టుకున్నారు. మరోవైపు జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.

సోమవారం  రాత్రి తాడేపల్లి, మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అతని ప్రియురాలు అంగడి జ్యోతితో కలిసి సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతుండగా, అమరావతి స్టేడియం సమీపంలో వీరిపై దాడి జరిగింది. శ్రీనివాస్ రావును చితకబాదిన నిందితులు.. జ్యోతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...