పల్నాడులో ఫ్యాక్షన్ హత్యచేసి రాజకీయ దుమారం సృష్టించే కుట్ర..

పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలు రేకెత్తించి రాజకీయ పార్టీల్లో గొడవలు లేపాలని దురుద్దేశ్యంతోనే ఆవ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని జిల్లా ఎస్పీ వివరించారు.

news18-telugu
Updated: March 23, 2019, 4:32 PM IST
పల్నాడులో ఫ్యాక్షన్ హత్యచేసి రాజకీయ దుమారం సృష్టించే కుట్ర..
గుంటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
  • Share this:
(రఘు అన్నా, గుంటూరు రిపోర్టర్, న్యూస్‌18)

పల్నాడులో టీడీపీ నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు ముప్పన వెంకటేశ్వర్లు హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నంచేశారు. శుక్రవారం గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా వెంకటేశ్వర్లును హతమార్చేందుకు ముగ్గురు వ్యక్తులు పథక రచన చేసినట్లు గుర్తించిన పోలీసులు.. మారణాయుధాలతో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, శివకృష్ణ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఇవాళ గుంటూరులో మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

రాజకీయంగా గుంటూరు జిల్లా చైతన్యం కలిగిన జిల్లా. అయితే ఫ్యాక్షన్ గొడవలకు కూడా పల్నాడు పేరుగా ఉన్న తరుణంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించింది. అయితే ఇటీవల కాలంలో గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును హతమారుస్తామంటూ మావోయిస్టుల పేరుతో వెలిసిన కరపత్రాలు జిల్లా పోలీసు యంత్రాంగంలో కలకలం రేపింది. ఆ హెచ్చరికలను సవాలుగా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ నామినేషన్ సమయంలో ఎమ్మెల్యే అనుచరుడైన ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ఇరువురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని పోలీసులకు సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ ఇరువుర్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరిపితే అసలు విషయం బయట పడింది.

నిందితులను మీడియాకు చూపుతున్న పోలీసులు


పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలు రేకెత్తించి రాజకీయ పార్టీల్లో గొడవలు లేపాలని దురుద్దేశ్యంతోనే ఆవ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని జిల్లా ఎస్పీ వివరించారు. ఇదిలా ఉంటే పల్నాడు ప్రాంతానికి చెందిన ముప్పన వెంకటేశ్వరరావుకి, నలబోతు ‌శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా భూ తగాదాలున్నాయని, ఈ తగాదాలు చిలికి చిలికి గాలివానలా మారి హత్యాయత్నం వరకు వెళ్లిందని ఎస్పీ పేర్కొన్నారు. ముప్పన వెంకటేశ్వరరావును హత్య చేసేందుకు శ్రీనివాసరావుతోపాటు శివక్రిష్ణ, పూర్ణచందరావు ముగ్గురు కలిసి పథకం రూపొందించారు. నామినేషన్ కోలాహలాన్ని అదునుగా ఎంచుకుని తమ చేతులకు పనిచెప్పారు. అయితే వారి వేసిన పథకాన్ని గుంటూరు జిల్లా రూరల‌్ పోలీసులు చాకచక్యంగా భగ్నం చేసి, ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి కొన్ని మారణాయుధాలతోపాటు మూడు తుపాకీలు, 4 రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.
First published: March 23, 2019, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading