Home /News /crime /

GUNTUR POLICE CHASE MOBILE THEFTING FROM CONTAINER CASE SU

కంటైనర్‌లో సెల్‌ఫోన్ల‌ చోరీ కేసును చేధించిన గుంటూరు పోలీసులు

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి

సెల్‌ఫోన్ లోడుతో వెళ్తున్న కంటైనర్‌ నుంచి ఫోన్లు చోరీ చేసిన కేసును గుంటూరు పోలీసులు కొద్దికాలంలో చేధించారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌లోని కంజరభట్ల గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

    సెల్‌ఫోన్ లోడుతో వెళ్తున్న కంటైనర్‌ నుంచి ఫోన్లు చోరీ చేసిన కేసును గుంటూరు పోలీసులు కొద్దికాలంలో చేధించారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌లోని కంజరభట్ల గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 913 సెల్‌ఫోన్‌లు, 4,50,000 రూపాయల నగదుతో పాటూ నిందితులు వినియోగించిన కట్టర్స్, ఎక్స్‌యూవీ వాహనం, లారీని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. "కంజరభట్ల గ్యాంగ్ అంటే ఆషామాషీ కాదు. కళ్ళుమూసి తెరిచేలోపు కాజేస్తారు. వీళ్లు ప్రాణాలు సైతం లెక్కచేయరు.. అలాగే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు.

    గత నెల 15వ తేదీన చిత్తూరు జిల్లా వేదాయపాలెం శ్రీ సిటీలోని రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి 13,760 మొబైల్స్ ప్యాలెట్లు లోడ్ చేసుకొని కంటెయినర్ కలకత్తాలోని జియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కి బయల్దేరింది. ఈ క్రమంలో కంటైయినర్‌ని ఫాలో చేసిన కంజరభట్ల గ్యాంగ్ గుంటూరు సమీపంలోని ఓ దాబా దగ్గర కంటైనర్ నిలిపి డ్రైవర్ టీ తాగడం గమనించారు. అదే సమయంలో 9 మంది కంజరభట్ల గ్యాంగ్ సభ్యులు కంటైనర్ సీల్ ఓపెన్ చేసి... 960 రెడ్‌మీ ఫోన్లు దొంగిలించారు. ఈ క్రమంలో వెనుక వస్తున్న వాహనచోదకులు చోరీ జరుగుతున్నట్లు డ్రైవర్ కి చెప్పారు. దీంతో తేరుకున్న డ్రైవర్ దొంగలను వారించేందుకు ప్రయత్నించగా వారు కత్తులతో బెదిరించి ఊడాయించారు" అని ఎస్పీ తెలిపారు.

    ఈ కేసును తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టామని.. 2 బ‌ృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో సీసీటీవీల ఫుటేజ్‌లు పరిశీలించి నిందితులను గుర్తించామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని.. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై, సెల్‌ఫోన్లు తరలించే కంపెనీలు రవాణాలో జాగ్రత్తలు పాటిస్తూ..లారీల వెనక తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చోరీ ఘటనలో డ్రైవర్‌ పాత్ర ఏమీ లేదని అమ్మిరెడ్డి ఆయన చేశారు. చివరిగా కేసును చేధించడంలో చొరవ చూపిన అధికారులను ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Guntur

    తదుపరి వార్తలు