Home /News /crime /

GUNTUR POLICE ARRESTED SEVEN MORE IN STUDENT PHOTO CASE AK

విద్యార్థిని నగ్న చిత్రాల కేసును చేధించిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థిని ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి.. బాధితురాలి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు.

    సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని నగ్నచిత్రాల కేసును గుంటూరు పోలీసులు చేధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో వరుణ్, ఫోటోలను పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన కౌశిక్‌లను దిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థిని ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి.. బాధితురాలి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే విద్యార్థిని న్యూడ్ వీడియోలను మణికంఠ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్ ఖాతా నుంచి పోస్ట్‌ చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో వరుణ్, కౌశిక్‌ల తరువాత మణికంఠ, ధనుంజయ్ రెడ్డి, కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఉపయోగించిన లాప్ టాప్, ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని ప్రకటించిన పోలీసులు... త్వరలోనే కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Guntur

    తదుపరి వార్తలు