• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • GUNTUR MOTHER SAVED HER ONE YEAR CHILD BEFORE SHE DIED IN AN ACCIDENT FULL DETAILS HERE HSN

బైక్ పై నుంచి ఏడాది బిడ్డతో సహా కింద పడిన తల్లి.. తన వైపుగా దూసుకొస్తున్న లారీని చూసి..

బైక్ పై నుంచి ఏడాది బిడ్డతో సహా కింద పడిన తల్లి.. తన వైపుగా దూసుకొస్తున్న లారీని చూసి..

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా జరిగిన ఓ ఘటన తల్లి ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తోంది. లారీ చక్రాల కింద పడి తాను చనిపోవడం ఖాయమని తెలిసి, తన చేతిలో ఉన్న బిడ్డను దూరంగా విసిరేసిందో తల్లి.

  • Share this:
    ఈ సృష్టిలో దేనికయినా ప్రత్యామ్నాయం ఉంది కానీ, తల్లి ప్రేమకు మాత్రం ప్రత్యామ్నాయం ఉండదు. తను కడుపు మాడ్చుకుని పిల్లల ఆకలిని తీరుస్తుంది. చివరకు తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి ఆ తల్లి వెనకాడదు. పిల్లల కోసం తన ప్రాణాలను ధారపోస్తుంది. అంతటి త్యాగం ఒక్క తల్లి మాత్రమే చేయగలదు. సినిమాల్లో మాత్రమే ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయని కొందరు అనుకుంటుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన తల్లి ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తోంది. లారీ చక్రాల కింద పడి తాను చనిపోవడం ఖాయమని తెలిసి, తన చేతిలో ఉన్న బిడ్డను దూరంగా విసిరేసిందో తల్లి. ఫలితం ఆమె మరణించినా బిడ్డ మాత్రం బతికే ఉన్నాడు. అద్దంకి‌‌- నార్కట్ పల్లి రహదారిపై శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన 23 ఏళ్ల కోటేశ్వరి, తన ఏడాది వయసున్న బాబు విజయ్ సంకేత్ ను తీసుకుని బంధువు అంకమరావుతో కలిసి బైక్ పై టీఎన్ నగర్ లో ఉన్న ఓ ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు. కొండమోడు కూడలి వద్ద అద్దంకి‌‌- నార్కట్ పల్లి రహదారిని దాటడానికి అంకమరావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన ఏడాది వయసున్న బాబుతో సహా కోటేశ్వరి కింద పడిపోయింది. తిరిగి లేస్తున్న సమయంలోనే ఆమెకు ఓ దృశ్యం కనిపించింది. నరసరావు పేట నుంచి పిడుగురాళ్ల వైపు వేగంగా ఓ లారీ వస్తుండటాన్ని చూసింది.
    ఇది కూడా చదవండి: ఓ ప్రేమ జంట రియల్ క్రైమ్ స్టోరీ.. టాలీవుడ్ లో కలకలం రేపిన కిడ్నాప్.. 6గంటల్లోనే చేధించిన పోలీసులు..

    అది సూటిగా తన వైపుగానే వస్తోంది. ఆమె ఒక్క క్షణం ఆలస్యం చేస్తే చాలు, ఊహించని ఘోరం జరిగి ఉండేది. కానీ ఆమెలో ఉన్న తల్లిమనసు వెంటనే స్పందించింది. తను చనిపోయినా పర్లేదు కానీ, బిడ్డ బతికి ఉండాలని ఆమె కోరుకుంది. తన చేతుల్లో ఉన్న బిడ్డను వెంటనే దూరంగా విసిరేసింది. ఆమె తన చేతుల్లోంచి బిడ్డను విసిరేసిన మరుసటి క్షణంలోనే లారీ ఆమె మీదుగా దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన గురించి వివరాలు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..
    Published by:Hasaan Kandula
    First published: