గుంటూరు మైనర్ రేప్ కేసు: కుటుంబానికి ఆర్థిక సాయం.. తల్లికి ఉద్యోగం

బాలిక కుటుంబానికి తక్షణం రూ.5 లక్షల సాయంతో పాటు చిన్నారి చదువు కోసం మరో రూ.2 లక్షలు ఇస్తామని సుచరిత తెలిపారు. ఇంటి స్థలంతో పాటు బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: December 16, 2019, 10:07 PM IST
గుంటూరు మైనర్ రేప్ కేసు: కుటుంబానికి ఆర్థిక సాయం.. తల్లికి ఉద్యోగం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు మైనర్ రేప్ కేసులో బాధితురాలిని ఏపీ హోంమంత్రి సుచరిత పరామర్శించారు. జీజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి చిన్నారితో మాట్లాడిన ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలిక కుటుంబానికి తక్షణం రూ.5 లక్షల సాయంతో పాటు చిన్నారి చదువు కోసం మరో రూ.2 లక్షలు ఇస్తామని సుచరిత తెలిపారు. ఎస్సీ,ఎస్టీ చట్టం నిబంధనల ప్రకారం మరో.2.50 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అంతేకాదు ఇంటి స్థలంతో పాటు బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు సుచరిత. మహిళల భద్రత కోసమే దిశ చట్టం తీసుకొచ్చామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లు పాసైన రోజే (డిసెంబరు 13) గుంటూరు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. రామిరెడ్డి నగర్‌లో ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. పై పోర్షన్‌లో ఉండే లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటనపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దిశా బిల్లు పాసైన రోజే ఘటన జరగడంతో.. ఈ కేసుపై ఏపీలో దుమారం రేగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: December 16, 2019, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading