హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: భార్యను హత్య చేసిన భర్త... ఓ ఎస్సై ఓవరాక్షన్ తో వెలుగులోకి సంచలన నిజాలు

Andhra Pradesh: భార్యను హత్య చేసిన భర్త... ఓ ఎస్సై ఓవరాక్షన్ తో వెలుగులోకి సంచలన నిజాలు

 అయినా.. చైతన్య యువతి వెంటపడడంతో కుటుంబ సభ్యులు భరించలేక పోయారు. దీంతో ఆయువకున్ని హతమార్చేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే మాట్లాడదామని ఈ 9వ తేదీన ఇంటికి పిలిపించారు.

అయినా.. చైతన్య యువతి వెంటపడడంతో కుటుంబ సభ్యులు భరించలేక పోయారు. దీంతో ఆయువకున్ని హతమార్చేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే మాట్లాడదామని ఈ 9వ తేదీన ఇంటికి పిలిపించారు.

వివాహేతర సంబంధం (Extra Marital Affair) మహిళ ప్రాణాలు తీసింది. ఇందులో ఓ ఎస్సై పేరు బయటకురావడం సంచలనంగా మారింది.

వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. తొమ్మిదేళ్ల కాపురం సజావుగా సాగింది. ఇంతో వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరికీ నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఆవేశంతో ఊగిపోయిన భర్త.. భార్యను దారుణంగా నరికి చంపాడు. పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు. పది రోజుల తర్వాత నిందితుడ్ని పట్టుకొచ్చిన పోలీసులు.. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని తెల్లబోయారు. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మహిళతో తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. మద్యానికి బానిసైన భర్త.. తరచూ భార్యను వేధిస్తుండేవాడు. అంతేకాకుండా ఆమెపై అనుమానంతో హింసించేవాడు.దీంతో విసిగిపోయిన భార్య.. సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వివాహితకు ఎస్సైతో పరిచయమైంది. పరిచయం కాస్తా మరింత ముదిరింది. ఎస్సైకి ఆమెకు మధ్య తరచూ ఫోన్ సంభాషణలు, చాటింగులు నడిచేవి. విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను మందలించాడు. ఇదే అంశాన్ని సదరు మహిళ ఎస్సైకి చెప్పింది. దీంతో భర్తను పోలీస్ స్టేషన్ కు పిలుపించుకున్న ఎస్సై పలుసార్లు అతడిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

అయినా సరే వేధింపులను భరించిన భర్త.. తన భార్యతో రాజీ కి యత్నించాడు. కానీ భర్త మాట వినని భార్య.. ఎస్సైతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. అతడిపై పలు కేసులు పెట్టి రివేంజ్ తీర్చుకుంది. భార్య ఇబ్బందులు పెట్టడం, ఎస్సై వేధింపులు భరించలేని భర్త.. ఓ నిర్ణయానికి వచ్చాడు. వాళ్లిద్దరి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తిరిగి తిరిగి మళ్లీ అదే స్టేషన్ కు వెళ్లాలి. దీంతో విసిగిపోయిన భర్త.. తన భార్యను నరికి చంపాడు. ఇదే విషయాన్ని ఎస్సై పేరుతో సహా పోలీసులకు వివరించాడు.

ఇదంతా విన్న పోలీసులకు దిమ్మతిరిగింది. అతడు నిజం చెప్తున్నా..? లేక కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నాడా..? అనేది తెలియక తలపట్టుకుంటున్నారు. ఐతే హత్య జరిగిన వెంటనే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిందితుడు దొరికిన వెంటనే.. స్వయంగా ఎస్సైనే వెళ్లి అరెస్ట్ చేయడంతో ఉన్నతాధికారులు కూడా అతడ్ని అనుమానిస్తున్నారు. ఐతే అసలు విషయం బయటకు రాకుండా సీక్రెట్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎస్సై నుంచి కూడా స్టేట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం. మరి ఈవిషయం తేలితే పోలీసులు ఎస్సైని కూడా బుక్ చేస్తారా..? లేదా..? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరిన్ని కీలక అంశాలు బయటకురావాల్సి ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Husband kill wife

ఉత్తమ కథలు