హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: సైబర్ నేరాల్లో ఇదో కొత్త వెర్షన్.. ఫోన్ కాల్ కట్ అయ్యేలోపు ఎకౌంట్ ఖాళీ

Andhra Pradesh: సైబర్ నేరాల్లో ఇదో కొత్త వెర్షన్.. ఫోన్ కాల్ కట్ అయ్యేలోపు ఎకౌంట్ ఖాళీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crime: సైబర్ నేరాలు రోజు రోజుకీ అప్ డేట్ అవుతున్నాయి. పోలీసులు (Police), బ్యాంకులు (Banks) ఎన్ని చర్యలు తీసుకున్నా.. నేరాలు మాత్రం అప్ డేటెడ్ వెర్షన్ లో జరుగుతున్నాయి.

  సైబర్ నేరాలు రోజు రోజుకీ అప్ డేట్ అవుతున్నాయి. పోలీసులు, బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. నేరాలు మాత్రం అప్ డేటెడ్ వెర్షన్ లో జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ ఏటీమ్ నెంబర్, ఓటీపీలు, ఎకౌంట్ వివరాలు అడిగిన తర్వాత ఖాతాల్లో డబ్బులు దోచేసే సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే చాలు ఎకౌంట్ లో డబ్బులు లాగేసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గుంటూరు నగరంలోని ఆనందపేటకు చెందిన ముజీబ్ సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈనెల 11న ఆతడికి గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. జైపూర్ లోని ఓ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన సైబర్ నేరగాళ్లు.. అతడితో మాట కలిపారు.

  మీరు ATM నుంచి రూ.20 వేలు డ్రా చేశారా అని అడిగారు. తాను ఎలాంటి విత్ డ్రా చేయలేదని చెప్పగానే.. గుర్తుతెలియని వ్యక్తులు మీకు తెలియకుండా 20వేల రూపాయలు డ్రా చేశారని.. ATM కార్డును బ్లాక్ చేస్తున్నామంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు. మీరు ఎవరు అని అడిగేలోపే కాల్ కట్ అయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఎకౌంట్ నుంచి రూ.20వేలు డ్రా చేయడమే కాకుండా డెబిట్ కార్డ్ బ్లాక్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆన్ లైన్ లో బ్యాలెన్స్ చెక్ చేయగా.. అందులో కేవలం రూ.24 మాత్రమే మిగిలాయి.

  దీంతో ముజీబ్ వెంటనే బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయగా.., ఓటీపీ, ఏటీఎం పిన్ నెంబర్ చెప్పారా అని అడిగి.. అలా చేయలేదని చెప్పగానే.. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటూ సాఫీగా సమాధానం ఇచ్చారు. తీరా టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే బ్రాంచ్ కు వెళ్లి కలవాలని చెప్పి తప్పించుకున్నారు. ఏం జరిగిందో అర్ధంకాని పరిస్థితుల్లో బ్యాంక్ స్టేట్ మెంట్ తీసి పరిశీలించగా తనకు తెలియకుండానే మూడుసార్లు నగదు డ్రా చేసినట్లు తేలింది. దీంతో అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, CYBER CRIME, Guntur, Telugu news, Vijayawada

  ఉత్తమ కథలు