గుంటూరులో హైటెక్ వ్యభిచారం...కాలేజీ అమ్మాయిలతో బీటెక్ స్టూడెంట్ దందా

పాలిటెక్నిక్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వీరబ్రహ్మం.. ఈ-సెట్‌లో 2 వేల ర్యాంకు సాధించి గుంటూరులో బీటెక్‌లో చేరాడు. వీరబ్రహ్మం ఓ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం వెతికాడు.

news18-telugu
Updated: January 4, 2020, 9:38 AM IST
గుంటూరులో హైటెక్ వ్యభిచారం...కాలేజీ అమ్మాయిలతో బీటెక్ స్టూడెంట్ దందా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరులో మరోసారి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ దదాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనికి ప్రధాన సూత్రధారి బీటెక్ విద్యార్థి కావడంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు. పాలిటెక్నిక్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వీరబ్రహ్మం.. ఈ-సెట్‌లో 2 వేల ర్యాంకు సాధించి గుంటూరులో బీటెక్‌లో చేరాడు. ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. వీరబ్రహ్మం ఓసారి ఓ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి పరిచయమై అతడి నుంచి రూ.30 వేలు తీసుకుని హైదరాబాద్‌ పంపాడు. అక్కడికి వెళ్లాక ఎవరూ లేకపోవడంతో అనుమానంతో రవికి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. అయితే వీరబ్రహ్మం ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో తాను కూడా ఇలా మోసం చేయవచ్చని భావించాడు.

దీంతో తన నెంబర్ కూడా ఆన్ లైన్‌లో పెట్టాడు. యువతుల్ని తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించడం ప్రరాంభించారు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లితో వీరబ్రహ్మానికి పరిచయం అయింది. ఆమెతో ఉంటూ థామస్ కుమార్‌తో కలిసి పాత గుంటూరులోని నంది వెలుగు రోడ్డులో గది అద్దెకు తీసుకుని వ్యభిచారం దందాకు తెరలేపారు. అయితే తరచూ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఇంటికి వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన పోలీసులు... నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు సమాచారం.

వీరబ్రహ్మం తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ యాప్‌ను తయారుచేసి దాని ద్వారా ఈ దందా నిర్వహిస్తుండడం చూసి పోలీసులు ఖంగుతిన్నారు.ఈ దందాను నిర్వహిస్తున్న... మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన నిడిగొండ వీరబ్రహ్మం, ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన ఉప్పల థామస్‌కుమార్‌, చేబ్రోలుకు చెందిన భూపతి నాగేశ్వరరావు, పాత గుంటూరులోని బాలాజీ నగర్‌కు చెందిన నల్లపాటి అశోక్‌కుమార్‌లను మీడియా ఎదుట హాజరు పరిచారు. వీరబ్రహ్మం ఫోన్‌లో తెలుగు రాష్ట్రాల్లో అనేక కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలు నెంబర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.
Published by: Sulthana Begum Shaik
First published: January 4, 2020, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading