Home /News /crime /

GUNTUR FOREST OFFICIALS RESCUED PANGOLIN FROM SELLERS BA

గుంటూరులో అలుగును అమ్మేందుకు అతి తెలివి ఐడియా..

అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న అలుగు

అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న అలుగు

అరుదైన అలుగు జంతువుని అటవీశాఖ అధికారులు అక్రమార్కుల చెర నుంచి రక్షించారు.

    అరుదైన అలుగు జంతువుని అటవీశాఖ అధికారులు అక్రమార్కుల చెర నుంచి రక్షించారు. అలుగును రూ. 65 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అక్రమార్కులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఎ.ప్రదీప్ కుమార్ గుంటూరు లో శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకి వెల్లడించారు. ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉన్న అరుదైన అలుగుని జగ్గాపురం ప్రాంతానికి చెందిన ఉయ్యాల శివకోటేశ్వరరావు, శివయ్యలు యడ్లపాడులో వలవేసి పట్టుకున్నారు. దాన్ని విక్రయించేందుకు యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ట్రాఫిక్ ఇండియా ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో అటవీశాఖ అధికారులే కొనుగోలు దారుల ముసుగులో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకొని అలుగును రక్షించారు. జంతువుల్ని వేటాడే అక్రమార్కుల్ని ప్రజలు గుర్తిస్తే తమకు సమాచారాన్ని అందించాలని ప్రదీప్ కుమార్ కోరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Guntur

    తదుపరి వార్తలు