నైజిరియా(Nigeria)లోని కట్సినా(Katsina)లో దారుణం జరిగింది. మసీదు(Mosque)లో ప్రార్ధనలు చేస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 12మంది దుండగుల తుపాకీ బుల్లెట్లకు బలయ్యారు. చనిపోయిన వారిలో మసీదు ప్రధాన ఇమామ్ కూడా ఉండటం విశేషం. అయితే ఇదంతా కాల్పుల అనంతరం మరికొందరు భక్తులను దుండగులు ఎత్తుకెళ్లారు. అధ్యక్షుడు బుహారి(Buhari)సొంత రాష్ట్రంలో ఈదారుణం జరగడం స్థానికంగా కలకలం రేపింది. అయితే దుండగులు ఎత్తుకెళ్లిన వారిలో కొందర్ని రక్షించినట్లుగా అక్కడి అధికార వర్గాలు ప్రకటించాయి.
మసీదులో మారణహోమం..
నైజీరియాలో సామాన్య ప్రజలకు రక్షణే లేకుండా పోతోంది. సాక్షాత్తు అధ్యక్షుడు బుకారి సొంత రాష్ట్రంలో దుండగుల ముఠా ఒకటి ప్రార్ధన చేస్తున్న మసీదుకు బైక్‌లపై తుపాకులు, పిస్టోల్స్ తీసుకొని వచ్చి కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 12మంది స్పాట్లో మృతి చెందారు. కాల్పులు జరుపుతున్న సమయంలో కట్సినాలో మైగమ్‌జీ మసీదుకు వచ్చిన దుండగుల్ని చూసి ప్రార్ధనలు చేస్తున్న వాళ్లంతా ప్రాణభయంతో అరుస్తూ పరుగులు పెట్టారు.
దుండగుల కాల్పుల్లో 12మంది మృతి..
కాల్పులతో ఆగకండా దుండగుల ముఠా సుమారు 20మందిని ఎత్తుకెళ్లారు. దుండగులు ఎత్తుకెళ్తున్న సమయంలో స్థానికుల సహాయంతో ఏడుగుర్ని రక్షించగా మరో 13మంది ఇంకా దుండగుల చెరలోనే బంధీగా ఉన్నట్లుగా కట్సినా రాష్ట్ర పోలీస్ అధికారి గంబో ఇసా ప్రకటించారు. అయితే ఈ ఘటన శనివారం రాత్రి భక్తులు మసీదులోప్రార్ధనలు చేస్తుండగా జరిగినట్లుగా నిర్ధారించారు. దుండగుల కాల్పుల్లో మసీదు ప్రధాన ఇమామ్ మృతిపై భక్తులు, పోలీసులు విచారం వ్యక్తం చేశారు.
మరో 13మంది కిడ్నాప్..
నైజీరియాలో దారుణాలు, దురాగతాలకు తెగబడే ముఠాలు ఈతరహా మారణహోమాన్ని సృష్టించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడ బంధిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై నిత్యం దాడులు చేయడం, చంపేయడం, డబ్బుల కోసం వారి ప్రాణాలతో చెలగాటమాడటం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటి దుశ్చర్యలను ఊపేక్షించని నైజీరియా నైజీరియా మిలటరీ బందిపోటు శిబిరాలపై దాడులు చేస్తున్నాయి. అయినప్పటికి వారి ఆగడాలు మరింత పెరిగిపోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gun fire, International news