GUN FIRING IN MAHABUB NAGAR POLICE SEIZE GUN BULLETS FROM TWO PEOPLE SK
రైల్వే ట్రాక్ వద్ద తుపాకీ కాల్పులు.. మహబూబ్నగర్లో కలకలం
ప్రతీకాత్మక చిత్రం
తుపాకీ పేలిన శబ్ధం గట్టిగా వినిపించడంతో ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. రవి వద్ద నుంచి తుపాకీతో పాటు బుల్లెట్లు, వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని తిమ్మసానిపల్లిలో రైల్వే ట్రాక్ వద్ద తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోతున్న రవి, చిన్నయ్య అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆయుధాలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో రవిని కొంత మంది కలిసి కొట్టారు. వారిపై కక్ష పెంచుకున్న రవి.. ఎలాగైనా చంపాలని పథకం రచించాడు. అందుకోసం స్నేహితుల సహకారంతో రూ.20వేలకు ఓ నాటు తుపాకీ కొన్నాడు. తనపై దాడిచేసిన వారిని ఆ తుపాకీతో హతమార్చాలని ప్లాన్ చేశాడు.
ఐతే తుపాకీని పేల్చడంపై రవికి అవగాహన లేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ప్రాక్టీస్ చేశాడు. తుపాకీ పేలిన శబ్ధం గట్టిగా వినిపించడంతో ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. రవి వద్ద నుంచి తుపాకీతో పాటు బుల్లెట్లు, వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.