• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • GUN FIRING IN ANDHRA PRADESH CM JAGAN WON CONSTANCY 2 PEOPLE WAS DIED NGS TPT

Andhra Pradesh: సీఎం జగన్ సొంత ఇలాకాలో భగ్గుమన్న కక్షలు.. ఇద్దరు మృతి

సీఎం సొంత ఇలాకాలో కాల్పుల కలకలం

కడపలో పాత కక్షలు మళ్లీ భగ్గు మన్నాయి.. అది కూడా సీఎం జగన్ సొంత ఇలాకాలో.. ఈ కాల్పులలో ఇద్దరు మరణించడం కలకలం రేపంది.. ఇంతకీ ఇంత దారుణంకి కారణం ఏంటి..?

  • Share this:
    కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేపింది. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని నల్లపు రెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్‌రెడ్డి గన్‌తో కాల్చి చంపి.. ఆ వెంటనే అతడు కూడా అదే గన్‌తో కాల్చుకొని చనిపోయాడు. అయితే ఈ హత్యలకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. చని పోయిన ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా శత్రుత్వం ఉంది. గ్రామంలోని ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో 48 ఏళ్ల పార్ధసారధి రెడ్డి కత్తితో ప్రసాద రెడ్డిపై దాడికి చేసేందుకు యత్నించాడు. దీంతో వెంటనే 62 ఏళ్ల ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్ తో పార్ధసారధి రెడ్డిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో పార్ధసారధి రెడ్డి శరీరంలోకి రెండు బుల్లెట్లు తగిలాయి. మూడో బుల్లెట్ లోడ్ చేసే లోగానే పార్ధసారధి రెడ్డి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన ప్రసాద్‌రెడ్డి అదే గన్‌తో కాల్చుకోని చనిపోయాడు. ఇద్దరూ అధికార వైసీపీకి చెందిన వారే.

    హత్యకు పాల్పడిన ప్రసాద్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. మాజీ ఎంపీటీసీగా ఉన్న ప్రసాదరెడ్డి త్వరలోనే మండలాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామంలో పంచాయతీలు చేస్తూ గ్రామపెద్దగా పేరు పొందారు. దాయాదిని కాల్చి చంపాడనే అపవాదు వస్తుందనే అవమాన భారంతో పశ్చాతాపం చెంది తాను కూడా కాల్చుకుని ఆత్నహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రసాదరెడ్డి కాల్చుకోగానే కొన ఊపిరితో ఉన్నారేమో అనే ఆశతో కుటుంబ సభ్యులు ఆయన్ను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు.

    ఇదీ చదవండి: రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి..! సీఎం జగన్ వ్యూహం ఫలిస్తుందా..?

    గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రసాదరెడ్డి, గతంలో పార్ధసారధి రెడ్డి కుటుంబం భార్యా భర్తల విషయంలో పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పంచాయతీలో తనకు అన్యాయం జరిగిందని భావించిన పార్ధసారధి రెడ్డి, శివప్రసాదరెడ్డిపై కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పిడినట్టు తెలుస్తోంది. తనను తాను రక్షించుకోటానికే శివప్రసాద రెడ్డి కాల్పులు జరిపినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది.2 కుటుంబాలను ముగ్గురు వైయస్ కుటుంబీకులు పులివెందుల ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం
    పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: