అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.

news18-telugu
Updated: August 25, 2019, 7:46 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో ఉన్న సోల్డన్‌ హైస్కూల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియాల కథనం ప్రకారం.. బాలిక తన కుటుంబంతో కలిసి పుట్‌బాల్‌ ఈవెంట్‌కు హాజరైంది. ఆ సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులుకు తెగబడ్డాడు. దీంతో బాలికతో పాటు ఇద్దరు టీనేజర్లు, 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఏప్రిల్‌ నుంచి ఈ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. గత రెండు నెలలు కాలంగా అమెరికాలో వరుస కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.
Published by: Sulthana Begum Shaik
First published: August 25, 2019, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading