Video: మా చెల్లి మీద చెయ్యేస్తావా.. యువకుడిని చీల్చి చెండాడిన యువతి..

సుమారు 01.47 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో చివరకు వారు... మరో చోట తేల్చుకోవడానికి నిర్ణయించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తోంది.

news18-telugu
Updated: October 20, 2019, 7:32 PM IST
Video: మా చెల్లి మీద చెయ్యేస్తావా.. యువకుడిని చీల్చి చెండాడిన యువతి..
యువకుడికి వార్నింగ్ ఇస్తున్న యువతి
news18-telugu
Updated: October 20, 2019, 7:32 PM IST
గుజరాత్‌లో ఓ యువతి యువకుడిని చితకబాదింది. తన చెల్లెలి మీద ఆ యువకుడు దాడి చేశాడన్న కోపంతో ఆమె అతడిని చావగొట్టింది. మొదట ఆతడిని చేతులతో కొట్టింది. ఆ తర్వాత ఏకంగా బెల్ట్ తీసుకుని చావబాదింది. మధ్యలో అడ్డు వచ్చిన వారికి కూడా వార్నింగ్ ఇచ్చింది. ‘నా చెల్లి మీద చెయ్యేస్తావా?. చెప్పు.. సారీ చెప్పు.’ అంటూ చాలా సేపు కొట్టింది. ఆ బెల్ట్ దెబ్బలు తింటున్నా కూడా యువకుడు ఆమెకు తిరగబడలేదు. పైగా తీరిగ్గా గుట్కా వేసుకుంటున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. అక్కడే ఉన్న మరికొందరు మిత్రులతో ఓ వీడియోను వెంటనే తెప్పించి వారికి చూపించాలని చెబుతున్నాడు. తాను ఆమె చెల్లెలిని ఎక్కడ కొట్టానో చూపించాలని డిమాండ్ చేశాడు. మరోవైపు ఆ ఘటనను వీడియో తీస్తున్న యువతి కూడా ‘నన్ను కొట్టావ్. నా పరిస్థితి చూడు ఎలా అయిందో’ అంటున్న మాటలు వినిపిస్తున్నాయి. సుమారు 01.47 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో చివరకు వారు... మరో చోట తేల్చుకోవడానికి నిర్ణయించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తోంది.



First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...