హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : హైదరాబాద్‌లో మరో ఘోరం.. గుజరాత్ యువతిపై అత్యాచారం.. పబ్‌లో పార్టీ తర్వాత..

Hyderabad : హైదరాబాద్‌లో మరో ఘోరం.. గుజరాత్ యువతిపై అత్యాచారం.. పబ్‌లో పార్టీ తర్వాత..

కేసు నమోదైన బాచుపల్లి పీఎస్

కేసు నమోదైన బాచుపల్లి పీఎస్

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనే మరో పబ్బులో పార్టీ తర్వాత ఇంట్లో దిగబెడతామంటూ మరో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గుజరాత్ కు చెందిన యువతి అని, హెచ్ సీయూ మాజీ విద్యార్థిని అని పోలీసులు పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

విశ్వనగరం హైదరాబాద్ (Hyderabad) లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రుమేనియాకు చెందిన బాలికను నడిరోడ్డుపై కారులో సామూహిక అత్యాచారం చేసిన జూబ్లీ హిల్స్ ఘటన దర్యాప్తు కొలిక్కిరాకముందే, తాజాగా కూకట్ పల్లి ప్రగతి నగర్ లో గుజరాత్ కు చెందిన మహిళపై రేప్ జరిగింది. ఈ రెండు ఘటనలూ పబ్బులో పార్టీ తర్వాత, అది కూడా ఇంట్లో దిగబెడతానని నమ్మించే జరగడం గమనార్హం.

గుజరాత్‌కు చెందిన 28 ఏళ్ల యువతి ఓ యువతిపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టెషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన బాధిత యువతి.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్ సీయూ)లో చదువు పూర్తయ్యాక.. ప్రగతినగర్‌లో ఉంటూ.. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నారు.

CM KCR | Prashant Kishor : బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శిగా పీకే! -కేసీఆర్ వెంట Sonu Sood?


ఈ నెల 13న జూబ్లీహిల్స్‌లోని రిపీట్‌ పబ్‌లో జరిగిన తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల్లో గుజరాత్ యువతి పాల్గొన్నారు. పార్టీ ఆలస్యం కావడంతో రాత్రి వేళ.. ఆమెను ఇంట్లో దింపడానికి కొందరు స్నేహితులు వచ్చారు. రాత్రి పొద్దుపోవడంతో వారంతా బాధితురాలి ఫ్లాట్‌లో ఉండాలనుకున్నారు. వారంతా 14వ తేదీ తెల్లవారుజామున 4.30 వరకు కబుర్లు చెప్పుకొంటూ కూర్చున్నారు. 5 గంటలకు కొందరు స్నేహితులు వెళ్లిపోగా.. బాధితురాలు తన గదిలో, మిగతా వారు హాల్‌లో నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో..

National Family Survey : భర్తలు కొట్టినా పర్వాలేదు : తెలుగు మహిళల్లో 83 శాతం మంది మాటిదే!


ఫ్లాట్ లోనే ఉండిపోయిన స్నేహితుల్లో ఒకడు బాధిత యువతి గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించగా.. మెడ, ఛాతీపై గాయాలు చేశాడు. ఘటన తర్వాత బాధితురాలు నేరుగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అయితే వాడి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

First published:

Tags: Hyderabad, Hyderabad police, Rape case

ఉత్తమ కథలు