హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆ సంబంధాన్ని నిలదీశాడని... భర్త మీద కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది...

ఆ సంబంధాన్ని నిలదీశాడని... భర్త మీద కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది...

నమూనా చిత్రం

నమూనా చిత్రం

80 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన భర్త... 90 కి.మీ. దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోగా మరణం...

  వివాహేతర సంబంధాన్ని నలదీశాడని... తన భర్తకు నిప్పు పెట్టిందో మహిళ. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. గుజరాత్‌లోని పంచ్‌ఋమహాల్ జిల్లా గోవింది గ్రామానికి చెందిన గురూజీ మనోర్ బాయ్ తడ్వీ అనే 40 ఏళ్ల వ్యక్తికి, బుదీబెన్ అనే అదే వయసు గల భార్య ఉంది. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. అయితే కొన్నాళ్లుగా బుదీబెన్ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా, రహస్యంగా అతనితో లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. భర్తకు విషయం తెలియడంతో రెండేళ్ల క్రితం ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. మళ్లీ మూడు నెలల క్రితం భర్త దగ్గరకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత కూడా అతనితో సంబంధం కొనసాగిస్తుండడంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన బుదీబెన్... భర్త మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించింది బుదీబెన్.


  ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని మనోర్ బాయ్... తేరుకుని లోగా ఒంటినిండా వంటలు వ్యాపించాయి. మంటల్లో కాలిపోతూ మనోర్ బాయ్ చేసిన కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు... వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన ఉన్న గురూజీని... సంఘటనా స్థలానికి 90 కి.మీ.ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి ఆలస్యం కావడంతో దారిలోనే మరణించాడు మనోర్ బాయ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేస్తున్నారు.


  ఇవి కూడా చదవండి...


  గోవాలో దారుణం... 15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా... ఆమె అత్త ఇంట్లోనే...


  ‘మానవత్వమా నువ్వెక్కడ’... 17 ఏళ్ల వయసులో తల్లి శవాన్ని సైకిల్‌పై 


  16 ఏళ్ల బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ కేసు... ఆ 8 మంది ఎక్కడ...


  VIDEO : గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి..

  First published:

  Tags: Crime

  ఉత్తమ కథలు