GUJARAT WOMAN REFUSES TO HAVE SEX WITH HUSBAND AFTER HE CALLS HER UNTOUCHABLE GETS THRASHED LATER HERE IS SHOCKING NEWS SK
పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..? సెక్స్‌కు నో చెప్పిన భార్య..భర్తం ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఓ రోజు రాత్రి భర్త సెక్స్ కోసం వస్తే.. ఆమె నిరాకరించింది. నేను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను సెక్స్ చేయనని తెగేసి చెప్పింది. అంతే.. అతడు కోపంతో ఊగిపోయాడు.
ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ భర్త పూర్తిగా మారిపోయాడు. సైకోలా తయారయ్యాడు. ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని గ్రామస్తులు ఎగతాళి చేయడంతో పునరాలోచనలో పడ్డాడు. భార్యతో నిత్యం గొడపడేవాడు. నువ్వు అంటరానిదానివని తిట్టేవాడు. అంతే.. ఆ ఒక్కమాటతో ఆ భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. నేను అంటరానిదానిని కదా.. నీతో సెక్స్ చేయనని తెగేసి చెప్పింది. శృంగారానికి నిరాకరించడంతో అతడు కోపం కట్టలు తెచ్చుకుంది. భార్యపై దాడి చేసి ఇంటిని నుంచి గెంటేశాడు. ఈ షాకింగ్ క్రైమ్ గుజరాత్లో వెలుగుచూసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మెహ్సానా జిల్లా జోతానా తాలుకాకు చెందిన జంట.. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె వయసు 20 ఏళ్లు. అతడి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మెమాగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఐతే అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం.. ఆ యువకుడేమో అగ్రకులాలకు చెందిన వాడు. ఐనప్పటికీ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. దళిత అమ్మాయిని పెళ్లి చేసున్నావా.. అంటూ గ్రామస్తులు ఎగతాళి చేశారు. కుటుంబ సభ్యులు కూడా సూటిపోటి మాటలతో వేధించేవారు. అలా అందరూ వెక్కిరించడంతో అతడు కూడా పునరాలోచనలో పడ్డాడు. అవును.. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని భావించాడు. పెళ్లికి ముందు బంగారం అని పిలిచిన అతడే.. ఇప్పుడు ఆమెను అంటరానిదని తిడుతున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే.. అంటరానిదానివని అనడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురయింది. ఓ రోజు రాత్రి భర్త సెక్స్ కోసం వస్తే.. ఆమె నిరాకరించింది. నేను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను సెక్స్ చేయనని తెగేసి చెప్పింది. అంతే.. అతడు కోపంతో ఊగిపోయాడు. భార్యను ఇష్టానుసారం కొట్టి బలవంతంగా అనుభవించాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో బంధించి రేప్ చేశాడు. చిత్రహింసలకు గురిచేశాడు. ఈ గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఐరన్ రాడ్డుతో తలపై కొట్టడంతో.. ఆమె ఆస్పత్రి పాలయింది. అనంతరం మెహ్సానాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత గత్లోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహహింస కింద కేసు పెట్టారు. కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టలేదని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.