Home /News /crime /

GUJARAT WOMAN LABOURER RAPED BY LAND OWNER IN SURENDRANAGAR COMMITS SUICIDE VB

Very Sad: పొలంలో కూలీ పనులు చేస్తున్న మహిళ.. ఏం చేస్తున్నావ్ అంటూ.. వెనుక నుంచి వచ్చిన భూ యజమాని.. ఒక్కసారిగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: పొలంలో ప‌నిచేసే వ్య‌వ‌సాయ కూలీ భార్య‌పై క‌న్నేసిన భూస్వామి ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ‌టంతో బాధితురాలు త‌నువు చాలించిన ఘ‌ట‌న గుజరాత్‌లోని సురేంద్రన‌గ‌ర్ జిల్లాలో జ‌రిగింది. వాద్వ‌న్ తాలూకాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  ఎన్ని చట్టాలు(Laws) తెచ్చినా ఈ కామాందుల్లో మార్పు రావడం లేదు. ఆడపిల్ల(Women) బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా భయం గుప్పిట్లో ఉంటున్నారు తల్లిదండ్రులు(Parents). ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు(Gang Rape) ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.

  Shameful: అమాయకంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూశారా.. ఆమెను షాప్ యజమాని ఏం చేశాడో తెలుసా..


  ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా ఓ మహిళా కూలీపై గుజరాత్ లో లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ అవమానం తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేంద్రనగర్ జిల్లా వాధ్వన్ తాలూకాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు చేసేందుకు ఓ కుటుంబం అక్కడికి వచ్చి నివాసముంటోంది. వాళ్లు ఆ భూములను సాగు చేసుకునేందుకు భూ యజమానుల వద్ద కూలీ మాట్లాడుకొని పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఆ భూమిలో పనిచేసే వ్యక్తి భార్యపై(30) ఆ భూ యజమాని కన్ను పడింది. ఎలాగైనా ఆమెతో తన కామ వాంఛ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

  Sad: ఎంత నమ్మించావ్ రా అయ్యా.. స్నేహితురాలిపై ఇలా చేయడానికి మనస్సు ఎలా ఒప్పుకుంది.. పాపం ఆమె నడిరోడ్డుపై


  ఆ రోజు కోసం వెయిట్ చ చేశాడు. ఇలా ఓ రోజు పొలంలో ఆమె కూలీ పని చేస్తుండగా ఆ భూ యజమాని యువరాజ్ సింగ్ పర్మార్ అక్కడకు చేరుకున్నాడు. ఇతడు రాజ్‌కోట్ నగరంలోని రతన్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆ సమయంలో ఆమె భర్త పనిమీద బయటకు వెళ్లాడు. తన కామ కోరిక తీర్చాలని యువరాజ్ సింగ్ ఆమెను బెదిరించాడు. వినకపోవడంతో బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. అడ్డొచ్చిన ఆమె 3 ఏళ్ల కొడుకును కూడా నిందితుడు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

  Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


  ఆమె అరుస్తున్న సయంలో గట్టిగ తన చేతులతో ఆమె ముఖంపై అడ్డుపెట్టి.. దారుణానికి పాల్పడ్డాడు. అంతక ముందే అతడు ఆమెను ఎన్నోసార్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన సదరు మ‌హిళ పొలంలోనే ఆత్మహత్యకు య‌త్నించింది. తీవ్ర గాయాల‌పాలై ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. భ‌ర్త ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకొని అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Attempt to suicide, Crime, Crime news, Gujarath, RAPE

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు