హోమ్ /వార్తలు /క్రైమ్ /

ట్యూషన్ టీచర్ పాడుపని.. బాలికను బలవంతంగా మందు తాగించి.. ఆ తర్వాత..

ట్యూషన్ టీచర్ పాడుపని.. బాలికను బలవంతంగా మందు తాగించి.. ఆ తర్వాత..

ప్రశాంత్ ఖోస్లా ట్యూషన్ టీచర్

ప్రశాంత్ ఖోస్లా ట్యూషన్ టీచర్

Gujarat: ట్యూషన్ టీచర్ దారుణానికి ఒడిగట్టాడు. తనతో కలిసి మద్యం సేవించాలని నీచానికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకొకపోవడంతో బలవంతంగా మద్యం ఆమెతో తాగించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

కొందరు ఉపాధ్యాయులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు సరైన చదువు, బుద్ధులు చెప్పాల్సిన వారే దిగజారీ వ్యవహరిస్తున్నారు. చదువు చెప్తామని చెప్పి.. విద్యార్థులను శారీరకంగా వాడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా.. ప్రైవేటు క్లాసులని, యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat)  దారుణ ఘటన జరిగింది. వడోదరలోని నిజాంపూర ప్రాంతంలోని ప్రశాంత్ ఖోస్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి స్థానికంగా ట్యూషన్ నడిపిస్తున్నాడు. అతని దగ్గర పదుల సంఖ్యలో బాల, బాలికలు ట్యూషన్ లకు వస్తుంటారు. అయితే.. అతను గత బుధవారం.. ట్యూషన్ కోసం వచ్చిన బాలికను ఇంటిలోపలికి తీసుకెళ్లాడు. తనతో మద్యం తాగాలంటూ డిమాండ్ చేశాడు.

బాలిక ఒప్పుకొక పోవడంతో బలవంతంగా ఆమె నోటిలో పోశారు. దీంతో బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆతర్వాత.. ఆమెను బాలిక ఇంటిదగ్గర వదిలేసి వచ్చాడు. వెంటనే తల్లిదండ్రులు బాలికను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో.. మెలకువ వచ్చాక.. ట్యూషన్ టీచర్ పైశాచిక ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను టెస్ట్ లో కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ట్యూషన్ టీచర్ ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కన్న తండ్రే కూతురు పాలిన కసాయిగా మారాడు.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan)  దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్ లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం కాస్త ఇంట్లో తెలిసింది. వెర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. అయితే.. నగ్మా ఇంట్లో నుంచి పారిపోయి నరేంద్రను ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది. అప్పుడు నగ్మా తండ్రి.. ఇస్లాంఖాన్.. తన కూతురుని మోసం చేసి పెళ్లిచేసుకున్నారని.. నరేంద్రపై కేసు పెట్టాడు.దీంతో మధ్యప్రదేశ్ కు వెళ్లి కొన్నినెలల పాటు ఉన్నారు. అక్కడ ఆమె గర్భవతి అయ్యిది.

ఆ తర్వాత.. తిరిగి భరత్ పూర్ కు వచ్చి కాపురం పెట్టారు. అప్పటి నుంచి నగ్మా తండ్రి అదను కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో.. రోటిన్ చెకప్ లో భాగంగా నరేంద్ర, నగ్మా ఆస్పత్రికి వెళ్తున్నారు. అప్పుడు నగ్మా తండ్రి ఆటోలో.. రోడ్డుపై వీరిద్దరు నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశాడు. వెంటనే వేగంగా వచ్చి ఇద్దరికి గుద్దడానికి యత్నించాడు. ఆటోను గమనించిన నరేంద్ర, నగ్మా లు అక్కడి నుంచి పారిపోయారు రోడ్డు మీద జనాలు గుమిగూడటంతో ఇస్లాంఖాన్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Alcohol, Crime news, Female harassment, Gujarat

ఉత్తమ కథలు