Home /News /crime /

GUJARAT SURAT POLICE RAID LUXURY SALON AND WELLNESS SPA IN LANTA BUSINESS HUB ARREST NINE INCLUDING THREE MANAGERS NK

పైకి స్పా... లోపల అమ్మాయిలతో మసాజ్... ఇంకా చాలా... 9 మంది అరెస్ట్

పైకి స్పా... లోపల అమ్మాయిలతో మసాజ్... ఇంకా చాలా... 9 మంది అరెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

పైకి స్పా... లోపల అమ్మాయిలతో మసాజ్... ఇంకా చాలా... 9 మంది అరెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

స్పా సెంటర్లకు ఒరిజినల్‌గా ఉండే పేరు పోయి... ఆ సెంటర్ల పేరు చెప్పగానే... ఇక అవే కార్యక్రమాలు గుర్తొచ్చే పరిస్థితి వచ్చేస్తోంది. అసలు ఆ స్పా కేంద్రంలో ఏం జరుగుతోంది? 9 మందిని ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకుందాం.

    అది గుజరాత్‌లోని సూరత్. ప్రపంచంలోనే వజ్రాలు సానపెట్టే పరిశ్రమకు కేరాఫ్ అడ్రెస్. ఐతే... అదే సూరత్‌లో వ్యభిచారం కూడా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. తరచూ అక్కడ రైడింగ్స్ చేసినప్పుడు పెద్ద ఎత్తున వ్యభిచార దందాలు బయటపడుతున్నాయి. ఈ కారణంగానే... వాటిని అరికట్టేందుకు పోలీసులు తరచూ స్పాలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పుట్టగొడుగుల్లా కొత్త స్పాలు పుట్టుకొస్తున్నారు. లోపలేమో అదే వ్యవహారాలు. తాజాగా వెసు VIP రోడ్డులో ఒలాంటా బిజినెస్ హబ్ అనే స్పా తెరిచారు. పైకి అదోరకమైన సెలూన్. లోపల జరిగేది వేరు. పోలీసులు రైడ్ చేసి... ముగ్గురు మేనేజర్లు సహా... 9 మందిని అరెస్టు చేశారు.

    మధ్యాహ్నం వేళ పోలీసులకు కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకున్నారు... అవతలి నుంచి ఓ వ్యక్తి... ఎంతో ఆతృతగా, తనకు మాత్రమే ఆ విషయం తెలుసు అన్నట్లుగా అత్యంత సీక్రెట్‌గా మ్యాటర్ లీక్ చేశారు. పోలీసులకు డౌట్ వచ్చింది. ఓ రెండు ఫొటోలు తీసి పంపమన్నారు. ఆ వ్యక్తి రహస్యంగా రెండు ఫొటోలు తీసి పంపాడు. చూస్తే మంచి స్పా లాగా కనిపించింది.


    పోలీసులు వెంటనే రైడ్ చేశారు. లోపలికి వెళ్తే... ఏ సమస్యా లేదు. ఓ మూల ఓ వ్యక్తికి మసాజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ... తమకు ఫోన్ చేసిన వ్యక్తి ఎందుకలా చెప్పాడు అని డౌట్ వచ్చిన పోలీసులు... మొత్తం ఇదేనా... ఇంకా ఏమైనా గదులు ఉన్నాయా అంటే... మేనేజర్లు నీళ్లు నమిలారు. దాంతో పోలీసులు చెక్ చెయ్యగా... వెనక కొన్ని గదులున్నాయి. వాటిలో థాయ్ మసాజ్ పేరుతో... అమ్మాయిలు అసభ్యకర దుస్తుల్లో మసాజ్ చేస్తూ కనిపించారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలున్నారు. అంతా థాయిలాండ్ వారే. పోలీసులకు మ్యాటర్ అర్థమైంది.



    పోలీసులను చూడగానే... హడావుడి పడిన కస్టమర్లను ఆరుగురినీ, ముగ్గురు మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలను సేఫ్టీ హోమ్‌కి తరలించారు. షాకింగ్ విషయమేంటంటే... అక్కడ స్పా కొత్తగా పెట్టినా... గత 7 నెలలుగా థాయి మసాజ్ పేరుతో... వ్యభిచార తంతు జరుగుతోందని తెలిసింది. మొత్తం 8 గదుల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. కస్టమర్ దగ్గర రూ.1000 వసూలు చేస్తున్నారు. అందులో రూ.500 అమ్మాయికి ఇస్తూ... మిగతా రూ.500 స్పా ఓనర్లు తీసుకుంటున్నారు. వచ్చిన కస్టమర్‌కి అరగంట వరకే లోపల అనుమతి ఇస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు తెలివైన వారు... పరిస్థితులను బాగా చక్కదిద్దుతారు

    ఇలా విదేశాల నుంచి వచ్చే అమ్మాయిలకు పోలీసులు చాలాసార్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారిలో కొంత మంది తిరిగి తమ దేశాలకు వెళ్లిపోతుంటే... మరికొందరు మాత్రం... కంటిన్యూ చేస్తున్నారు. పోలీసులు తరచూ ఇలాంటి రైడింగ్స్ చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gujarat, Sex Racket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు