హోటల్లో కప్పులు కడుగుతున్న కోటీశ్వరుడి కొడుకు.. అసలు కథ ఏంటంటే....

20 రోజుల పాటు సరైన తిండి, నిద్ర లేకుండా రోడ్డు పక్కన పడుకుని కాలం గడిపిన అతడిని చూసి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

news18-telugu
Updated: November 6, 2019, 10:10 PM IST
హోటల్లో కప్పులు కడుగుతున్న కోటీశ్వరుడి కొడుకు.. అసలు కథ ఏంటంటే....
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడు కోటీశ్వరుడి కొడుకు. కానీ హోటల్లో కప్పులు కడుగుతూ కాలం గడిపాడు. ఫుట్ పాత్ మీద పడుకున్నాడు. ఎవరైనా పెడితే తిన్నాడు. లేకపోతే పస్తులు పడుకున్నాడు. ఇదంతా ఏదో పబ్లిసిటీ కోసమో, సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకోవడానికో కాదు. ఆ కుర్రాడు ఇంట్లో నుంచి పారిపోయాడు. గుజరాత్‌కు చెందిన ఓ కోటీశ్వరుడైన వ్యాపారికి 19 ఏళ్ల కొడుకు ద్వారకేష్ థక్కర్ ఉన్నాడు. అతడికి కాలేజీకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ, తల్లిదండ్రులు అతడిని చదువుకోమని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అక్టోబర్ 14వ తేదీన కాలేజీకి వెళ్తున్నానని చెప్పిన ద్వారకేష్.. వడోదర రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు. తన ఫోన్ ఇంట్లో వదిలేసి వచ్చేశాడు. ఢిల్లీలో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి మళ్లీ మరో ట్రైన్ ఎక్కి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా వెళ్లిపోయాడు.

తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో ద్వారకేష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు ఓ ఆటోలో వెళ్లినట్టు గుర్తించి.. ఆ ఆటోవాలాను పట్టుకున్నారు. అతడు వడోదర రైల్వేస్టేషన్‌లో దిగినట్టు ఆటోడ్రైవర్ చెప్పాడు. అప్పుడు రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఢిల్లీ రైలు ఎక్కినట్టు గుర్తించారు.

ఈ క్రమంలో సిమ్లా వెళ్లిన ద్వారకేష్ అక్కడ రోడ్డుపక్కన టిఫిన్ బండ్ల వద్ద పనిచేస్తూ.. వారు ఇచ్చినది తింటూ గడిపాడు. ఈ క్రమంలో ఓ హోటల్ వద్దకు వెళ్లి పనికావాలని అడిగాడు. అయితే, అతడి వాలకం చూసిన హోటల్ యజమానికి అనుమానం వచ్చింది. ద్వారకేష్ వద్ద తనిఖీ చేయగా ఓ ఐడీ కార్డు కనిపించింది. ఆ ఐడీ కార్డు మీద గుజరాత్‌లోని పాద్రా అడ్రస్ ఉంది. ఆ హాటల్ యజమాని వెంటనే ఇంటర్నెట్‌లో వెతికి... సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. హోటల్ యజమాని నుంచి ఫోన్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ద్వారకేష్ ఫొటోను అతడికి పంపి.. వివరాలు క్రాస్ చెక్ చేసుకున్నాడు. అతడు ద్వారకేష్ అని ఖరారైంది.

గుజరాత్ నుంచి సిమ్లా వెళ్లడానికి పోలీసులకు చాలా సమయం పడుతుంది. దీంతో వెంటనే ఓ ఆలోచన చేశారు. ఆ సమయంలో జిల్లా నుంచి పోలీసులు ఎవరైనా సిమ్లా వెళ్లారా? అని చెక్ చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కుటుంబంతో కలసి సిమ్లా పర్యటనకు వెళ్లారు. దీంతో వెంటనే పోలీసులు ఆ కానిస్టేబుళ్లకు సమాచారం ఇచ్చారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు.. హోటల్ మేనేజర్ చెప్పిన అడ్రస్‌కు వెళ్లే సమయానికే ద్వారకేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరు పోలీసులు.. అతడి ఫొటో పట్టుకుని సిమ్లాలోని టిఫిన్ బండ్లు, హోటళ్ల వద్ద వెతకడం ప్రారంభించారు. కనిపించిన ప్రతి వారినీ అడుగుతూ వెళ్లారు. చివరకు సోమవారం రాత్రి ద్వారకేష్‌ ఓ ఫుట్ పాత్ మీద పడుకుని ఉండగా ఆటోడ్రైవర్ గమనించి అతడి కోసం వెతుకున్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి ద్వారకేష్‌ను పట్టుకున్నారు.

ద్వారకేష్ పోలీసుల సంరక్షణలో ఉన్నాడనే విషయాన్ని వారు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అతడి బంధువులు విమానంలో సిమ్లా చేరుకున్నాడు. 20 రోజుల పాటు సరైన తిండి, నిద్ర లేకుండా రోడ్డు పక్కన పడుకుని కాలం గడిపిన అతడిని చూసి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
First published: November 6, 2019, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading