ఆవుపై అఘాయిత్యం...కటకటాల వెనక్కి కామాంధుడు

మనుషులతో మనుషులకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. గోవును దేవతగా పూజించే పుణ్యభూమిలో ఓ మదమెక్కిన కామాంధుడు దానితోనే లైంగిక చర్యలకు దిగాడు.

news18
Updated: November 6, 2020, 10:29 AM IST
ఆవుపై అఘాయిత్యం...కటకటాల వెనక్కి కామాంధుడు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 6, 2020, 10:29 AM IST
  • Share this:
గోమాతను దేవతగా పూజించే పుణ్యభూమి మనదేశం. కన్నతల్లిలా చూసుకోవాల్సిన ఆవుపై కామంతో ఒళ్లు మరిచిపోయిన ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై ఈ చర్యకు ఒడిగట్టాడు దుండగుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై ఆ కామాంధుడు లైంగికదాడికి పాల్పడుతున్న సమయంలో ఈ ఘటనంతా అక్కడే ఉన్న సీసీ టీవలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్  మీడియాలో వైరల్ గా మారడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

గుజరాత్ లోని దేవభూమిగా పిలిచే ద్వారకా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ద్వారకా పాత మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో కట్టేసి ఉన్న ఆవుపై ఒళ్లు మరిచిపోయిన  భరత్ అశ్వర్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఆవు అటూ ఇటూ కదులుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా..  ఆ కామాంధుడికి కనికరం కలగలేదు. ఇది అక్కడే ఉన్న అతుల్ దేవ్ అనే సామాజిక కార్యకర్త చూసి అటువైపుగా పరిగెత్తుతూ రావడంతో.. అశ్వర్ అక్కడ్నుంచి పారిపోయాడు.

సీసీ టీవీ లో రికార్డైన ఈ వీడియో ద్వారా పోలీసులు అశ్వర్ ను గుర్తించారు. అతడు ఒక రిక్షా డ్రైవర్ అని.. అతడు తనకు బాగా తెలుసునని అతుల్ దేవ్ తెలిపాడు. ఏదేమైనా నిందితుడు చేసింది తప్పని.. భారతీయ శిక్షా స్మృతి లోని 377 సెక్షన్ ప్రకారం.. జంతువులపై క్రూరత్వంతో వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి కటకటాల  వెనక్కి నెట్టారు.  దీనిపై గోమాత సంఘాల అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశంలో ఆవులకు రక్షణ  కరువైందని.. తల్లుల్లా చూసుకోవాల్సిన ఆవులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  వారు డిమాండ్ చేస్తున్నారు.  కఠినమైన శిక్షలు విధిస్తేనే వారికి ఆవును చూస్తే భయం పుడుతుందని అంటున్నారు.

గతంలో మధ్యప్రదేశ్ లో కూడా ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జులైలో భోపాల్ కు చెందిన ఒక వ్యక్తి.. ఆవుపై అత్యాచారం చేశాడు. నిందితుడు సబీర్ అలీ.. సుందర్ నగర్ లో ఉన్న ఒక డెయిరిలోకి వెళ్లి మరీ ఆవును రేప్ చేశాడని ఆ డైరీ యజమాని ఆరోపించాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Published by: Srinivas Munigala
First published: November 6, 2020, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading