Home /News /crime /

GUJARAT MAN INSURES DYING BROTHER AND CLAIMS LIFE INSURANCE COMPENSATION IN JUST 21 DAYS SK

చచ్చిపోయే అన్నకి ఇన్సూరెన్స్.. 21 రోజుల్లోనే క్లెయిమ్.. అబ్బా.. ఏం తెలివిరా.. అయ్యా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరణ్ ఈ బీమా పాలిసీ తీసుకున్న సమయంలో భైలాల్ ఆరోగ్యం విషమంగా ఉందని.. అతడు కొద్ది రోజుల్లో మరణిస్తాడని తెలిసి... ఉద్దేశపూర్వకంగా జీవిత బీమా పాలిసీని తీసుకున్నాడని కంపెనీ విచారణలో తేలింది.

    సోదరుడి ఆరోగ్యం విషమించింది. మద్యానికి బానిసవడంతో కాలేయం దెబ్బతింది. బెడ్డుపై చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. తన అన్న చనిపోతాడని తెలిసి.. తమ్ముడు ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. చనిపోయే వ్యక్తికి బీమా పాలిసీ తీసుకొని.. ఆ డబ్బులను కొట్టేయాలని అనుకున్నాడు. అంతా అనుకున్నట్లే చేశాడు. కానీ బీమా తీసుకున్న కొన్ని రోజులుగా పాలిసీదారుడు మరణించడంతో.. కంపెనీకి అనుమానం వచ్చింది. ప్రైవేట్ డిటెక్టివ్స్‌తో విచారణ చేయిస్తే.. అసలు నిజం తెలిసింది. గుజరాత్‌లోని వడోదరాలో ఈ ఘటన జరిగింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరాలోని నాగర్వాడ ప్రాంతానికి చెందిన కరణ్ భీల్ వయసు 29 ఏళ్లు. ఇతడి బైలాల్ భీల్ అనే సోదరుడు ఉన్నాడు. 2020 అక్టోబరు 30న తన అన్న బైలాల్ భీల్ పేరుతో జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు కరణ్. రూ.22 లక్షల జీవిత బీమాకు మొదటి సారి రూ.3,060 ప్రీమియం కట్టాడు. బీమా పాలిసీ నిబంధనల ప్రకరం.. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కంపెనీకి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. అంతేకాదు ఆల్కాహాల్, పొగాకు ఉత్పత్తులకు బానిస అయ్యాడా? అనే వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బైలాల్‌కి ఈ అలవాట్లు ఉన్నా.. ఆరోగ్యం పాడైపోయినా.. ఆ విషయాలను దాచి పెట్టి..బీమా కట్టాడు కరణ్.

    Whatsapp: మీ భార్య ఫొటోను వాట్సప్ డీపీగా పెడుతున్నారా? ఐతే తస్మాత్ జాగ్రత్త..

    తనను భైలాల్ భీల్‌గా చెప్పుకొని.. జీవితా బీమా దరఖాస్తు ఫారంని కరణ్ భీలే నింపాడు. ఐతే భైలాల్‌కు అప్పటికే లివర్ సిరోసిస్ వ్యాధి ఉంది.ఆ వివరాలను కంపెనీకి చెప్పలేదు. ఈ జీవిత బీమా పాలిసీకి తనను నామినీగా పెట్టుకున్నాడు కరణ్. ఎందుకంటే.. ఇందతా పక్కా ప్లాన్‌తో చేస్తున్నాడు. తన చనిపోతాడని అతడికి తెలుసు. అలాంటి వాడికి బీమా పాలిసీ తీసుకొని.. మరణించిన తర్వాత బీమా డబ్బులు నొక్కేయాలన్నది అతడి ప్రణాళిక. తాను అనుకున్నట్లుగానే పథకాన్ని అమలు చేశాడు.

    జీవితా భీమా పాలిసీ తీసుకున్న 21 రోజులకే తన అన్న మరణించాడని, తానే నామినీని అని క్లెయిమ్ కోసం కరణ్ బీల్ దరఖాస్తు చేశాడు. తన సోదరుడు నవంబరు 20, 2020 న మరణించాడని చెప్పి.. జనవరి 16, 2021న క్లెయిమ్‌ని సబ్మిట్ చేశాడు. పాలిసీ తీసుకున్న కొద్ది రోజులకు భైలాల్ మరణించడంతో కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. నిజానిజాలను తెలుసుకునేందుకు సదరు బీమా కంపెనీ ఇద్దరు ప్రైవేట్ డిటెక్టివ్స్‌ని ఏర్పాటు చేసింది. విచారణలో సంచలన విషయాలు వారికి తెలిశాయి.

    Affair: భర్త, పిల్లలతో హాయిగా ఉండకుండా దారితప్పావ్.. చివరకి ఆ బంధానికే బలయ్యావు కదమ్మా..forgery

    భైలాల్‌కు మద్యం, ధూమపానం అలవాట్లు ఉన్నాయని తేలింది. విపరీతంగా మద్యం తాగడంతో లివర్ పాడైపోయి.. లివర్ సిరోసిస్ వ్యాధి బారిననపడినట్లు గుర్తించారు. కానీ ఈ విషయాన్ని పాలిసీ ఫారమ్‌లో వెల్లడించలేదు. కరణ్ ఈ బీమా పాలిసీ తీసుకున్న సమయంలో భైలాల్ ఆరోగ్యం విషమంగా ఉందని.. అతడు కొద్ది రోజుల్లో మరణిస్తాడని తెలిసి... ఉద్దేశపూర్వకంగా జీవిత బీమా పాలిసీని తీసుకున్నాడని కంపెనీ విచారణలో తేలింది. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి పేరిట.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో.. జీవిత బీమా పాలిసీ తీసుకొని తమను మోసం చేశాడని సదరు బీమా కంపెనీ ప్రతినిధి ఆజింక్య దేశ్‌ముఖ్ ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోద చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సీఐడీ విచారణ జరుపుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime, Crime news, Gujarat, Life Insurance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు