Home /News /crime /

GUJARAT MAJOR FIRE IN AHMEDABAD COMPLEX 10 CHILDREN AMONG 50 RESCUED FROM HOSPITAL LOCATED IN BUILDING PAH

Major Fire: గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో చెలరేగిన మంటలు..

ఆస్పత్రిలో వ్యాపించిన మంటలు

ఆస్పత్రిలో వ్యాపించిన మంటలు

Gujarat: అహ్మదాబాద్ లోని పరిమల్ గార్డెన్ సమీపంలో ఉన్న ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. దీంతో పెషెంట్ లు బైటకు పరుగులు పెట్టారు.

గుజరాత్ లో (Gujarat) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని పరిమల్ గార్డెన్ సమీపంలో ఉన్న బహుళ అంతస్తుల వాణిజ్య భవనం దేవ్ కాంప్లెక్స్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రంతా మంటలు వ్యాపించాయి. దీంతో పెషెంట్లు, సిబ్బంది బైటకు పరుగులు తీశారు. దీనిలో.. 10 మంది పిల్లలతో సహా 50 మందికి పైగా వ్యక్తులు రక్షించబడ్డారని అధికారులు పేర్కొన్నారు. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

దీంతో ఆప్రాంతమంతా దట్టంగా పొగలు (Fire accident) అలుముకున్నాయి. ఈ క్రమంలో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనపై.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కాగా, సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. 27 ఫైరింజన్ లను ఘటన స్థలానికి పంపించారు. అంబులెన్స్ లను ఏర్పాడు చేశారు. పేషెంట్ లను ఇతర ఆస్పత్రులకు మార్చారు. ఆస్పత్రి నాలుగో అంతస్థులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది.

సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Fire Accident, Gujarat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు