విడాకులు తీసుకున్న తర్వాత భార్యపై అనుమానం.. ఓ రోజు ఆమె నుంచి ఫోన్ కాల్.. తర్వాత ఏం జరిగిందంటే..?

నేహా, శైలేష్

శుక్రవారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన మాటలు విన్న సిబ్బంది.. తొలుత ఫేక్ కాల్ అని భావించారు. అయితే అవతలి వ్యక్తి మరిన్ని వివరాలు చెప్పేసరికి షాక్ తిన్నారు. వెంటనే ఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు.

 • Share this:
  శుక్రవారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తన భార్యను చంపేశాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పోలీసు సిబ్బంది.. తొలుత ఫేక్ కాల్ అని భావించారు. అయితే అవతలి వ్యక్తి మరిన్ని వివరాలు చెప్పేసరికి షాక్ తిన్నారు. వెంటనే ఘటన స్థలానిక బయలుదేరి వెళ్లారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో (Rajkot) చోటుచేసుకుంది. వివరాలు.. శైలేస్ అలియాస్ రాహుల్ అనే వ్యక్తికి నేహా అనే యువతితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కూతురు కూడా ఉంది.

  అయితే శైలేష్, నేహా దంపతులు ఎనిమిది నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల (Divorce) తర్వాత కూతురును నేహా తన వద్దే ఉంచుకుంది. అయితే విడాకుల తర్వాత కూడా శైలేష్, నేహాల మధ్య అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేహాకు వేరు వ్యక్తులతో ఎఫైర్ (Affair) ఉందనిశైలేష్ భావించాడు. ఈ క్రమంలోనే అతడు పలు సందర్భాల్లో నేహాతో గొడవపడ్డాడు. మరోవైపు నేహా తన కూతరుని కాపాడుతుందా లేదా అని శైలేష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. దీంతో నేహా, శైలేష్‌ల మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.

  Bhoomi Trivedi: ప్రముఖ సింగర్‌ భూమి‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు.. మరో సింగర్ రాహుల్‌పై కూడా.. కేసు ఏమిటంటే..

  ఈ క్రమంలోనే శైలేష్ నేహాను హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం గత ఐదు రోజులుగా ప్రయత్నాలు చేశాడు. కానీ నేహాను చంపేందుకు అనువైన సమయం దొరకలేదు. దీంతో శైలేష్.. సరైన అవకాశం కోసం వేచి చూశాడు. శుక్రవారం సాయంత్రం నేహా తన మాజీ భర్త.. శైలేష్‌కు ఫోన్ చేసింది. తనను ఘంటేశ్వర్ తీసుకెళ్లాలని కోరింది. ఆ తర్వాత ఘంటేశ్వర్ నుంచి బజరంగ్వాలి వద్ద డ్రాప్ చేయాలని చెప్పింది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శైలేష్ వెంటనే ఆమెకు ఒకే అని చెప్పాడు.

  కొంపముంచిన Google Maps.. ఊహించని మలుపు తిరిగిన ప్రయాణం.. అసలేం జరిగిందంటే..

  ఇక, నేహాను తీసుకుని ఘంటేశ్వర్ నుంచి కారులో బజరంగ్వాలికి శైలేష్ కారులో బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో దారి మళ్లించి.. అటల్ సరోవర్ సమీపంలోనిఓ పాడుపడిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారులోకి నుంచి ఆమెను బయటకు లాగి కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి ఆమెను హత్య (Man Kills Ex Wife) చేశాడు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి భార్యను చంపానని చెప్పాడు. అయితే అది ఫేక్ కాల్ అని భావించిన పోలీసు సిబ్బంది.. సంఘటన స్థలం గురించి చెప్పాలని కోరారు. దీంతో శైలేష్.. నేహాను చంపిన ప్రాంతం గురించి వారికి చెప్పాడు.

  దీంతో అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే యూనిర్సిటీ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడి పోలీసులు ఘటన స్థలానిక బయలుదేరారు. నేహాను హత్య చేసిన ప్రాంతంలోకి చేరుకన్న పోలీసులను శైలేష్ దగ్గరుండి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ నేహా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. శైలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శైలేష్‌పై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అదే సమయంలో హత్యకు ఉపయోగించిన కత్తితో సహా ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: