హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇదేందయ్యా ఇది : శృంగారం కోసం వేధిస్తున్నాడని 89ఏళ్ల భర్తపై 87ఏళ్ల భార్య కంప్లెయింట్

ఇదేందయ్యా ఇది : శృంగారం కోసం వేధిస్తున్నాడని 89ఏళ్ల భర్తపై 87ఏళ్ల భార్య కంప్లెయింట్

ప్రతీకాత్మక చిత్రం(Image source : google)

ప్రతీకాత్మక చిత్రం(Image source : google)

 Granny compliant on husband : గుజరాత్‌(Gujarat)లోని వడోదర(Vadodara)లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. శృంగారం(Romance) కోసం 89 ఏళ్ల తన భర్త(Husband) పదేపదే వేధిస్తున్నానంటూ 87 ఏళ్ల వృద్ధురాలు(Old Woman) హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Granny compliant on husband : గుజరాత్‌(Gujarat)లోని వడోదర(Vadodara)లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. శృంగారం(Romance) కోసం 89 ఏళ్ల తన భర్త(Husband) పదేపదే వేధిస్తున్నానంటూ 87 ఏళ్ల వృద్ధురాలు(Old Woman) హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. ఈ వయసులోనూ శృంగారం కోసం తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, అనారోగ్యంగా,అలసటగా ఉందని చెబుతున్నప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని కన్నీటిపర్యంతమయ్యింది. చివరకు హెల్ప్‌లైన్ బృందం ఆ వృద్ధ దంపతులకు ఓ మార్గాన్ని చూపింది.

అసలేం జరిగింది

మహిళల సమస్యలకు పరిష్కారం చూపేందుకు "181 అభయం(181 Abhayam)" పేరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌‌ను గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీని ద్వారా మహిళల సమస్యలకు పరిష్కారం సూచిస్తున్నారు. ఈ నెంబర్​కు ఇటీవల వడోదరకు చెందిన ఓ వృద్ధురాలి నుంచి ఫోన్​ వచ్చింది. తన వయస్సు 87 ఏళ్లు అని,అనారోగ్యానికి గురికావడంతో కదలేని స్థితిలో మంచానికి పరిమితయ్యానని..ఈ పరిస్థితిలో శృంగారం చేయాలంటూ 89 ఏళ్ల తన భర్త పదేపదే డిమాండ్‌ చేస్తున్నాడని, దానిని తాను భరించలేకపోతున్నానని ఆ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. శృంగారానికి నిరాకరిస్తున్న తనపై భర్త ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని తెలిపింది. అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని చెబుతున్నప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసింది.

Husband Sell Wife Kidney : భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండానే అమ్మి మరో పెళ్లి చేసుకున్న భర్త!

ఇది విన్న 'అభయం' బృందం ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చింది. అలాంటి కోరికలను ఎలా అధిమగమించాలన్న దానిపై వివరించారు. యోగా, ధాన్యంపై మనసును లగ్నం చేయాలని, మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ఆ వృద్ధుడికి సూచించింది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం ఆయనను సెక్సాలజిస్ట్‌కు చూపించాలని కుటుంబసభ్యులకు సూచించారు. అంతేకాకుండా ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లించేందుకు సీనియర్‌ సిటిజన్ల గార్డెన్లు, పార్కులను సందర్శించాలని ఆ వృద్ధుడికి సూచించారు. దీంతో ఈ అంశం కాస్త ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది. అయితే అభయం బృందం సూచనలు పనిచేశాయని సమాచారం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Gujarat, Husband, Old women

ఉత్తమ కథలు