19 ఏళ్ల పక్కింటి యువతితో పరారైన వృద్ధుడు...

తన మనవరాలి వయసున్న యువతితో కలసి పారిపోయాడు ఓ వృద్ధుడు.

news18-telugu
Updated: July 11, 2020, 9:30 PM IST
19 ఏళ్ల పక్కింటి యువతితో పరారైన వృద్ధుడు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన మనవరాలి వయసున్న యువతితో కలసి పారిపోయాడు ఓ వృద్ధుడు. గుజరాత్‌లోని పఠాన్ జిల్లాలో సిధాపూర్ తాలూకాలో ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. జూన్ 2న యువతి బయటకు వెళ్లివస్తానని చెప్పి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. అదే సమయంలో పక్కింట్లో ఉండే వృద్ధుడు కూడా కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలి సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. యువతిని ముసలి వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని, ఆమెను లైంగికంగా కూడా వేధింపులకు గురి చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా యువతిని కాపాడాలని కోరారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. బాధితురాలిని వెతికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. జూన్ 29న కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉండగా, పోలీసులు సఫలం కాలేదు. దీంతో మరో రెండు వారాలు గడువు ఇచ్చింది న్యాయస్థానం. ఈనెల 13వ తేదీ లోపు పోలీసులు ఆమెను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాల్సి ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 11, 2020, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading