హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: 12 వ అంతస్తు నుంచి బిడ్డతో సహా దూకేసిన పోలీసు భార్య.. కారణం ఏంటంటే..

OMG: 12 వ అంతస్తు నుంచి బిడ్డతో సహా దూకేసిన పోలీసు భార్య.. కారణం ఏంటంటే..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

Gujarat: భార్య భర్తలు ఇద్దరు తరచుగా గొడవలు పడేవారు. ఎవరు వచ్చి సర్దిచెప్పిన అసలు పట్టించుకునే వారు కాదు. దీంతో భార్య దారుణమైన అఘాయిత్యానికి పాల్పంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

పెళ్లయ్యాక చాలా మంది భార్యభర్తలు కలిసే ఉంటారు. కానీ కొందరు మాత్రం ప్రతిదానికి గొడవలు పడుతుంటారు. తమదే నడవాలన్నట్లు ఎందాకైన వెళ్తుంటారు. తమ ఈగో కోసం.. కాపురాన్ని కూడా బజారుకు ఈడ్చుకుంటారు. చిన్న విషయాలకు కూడా భూతద్దంలో పెట్టి చూసుకుంటూ రియాక్ట్ అవుతుంటారు. మరికొందరు.. డబ్బుల కోసం తరచుగా భార్యలతో గొడవలు పడుతుంటారు. ప్రతిదానికి వంక పెడుతుంటారు. ఏదో ఒక కారణంతో భార్యలను వేధిస్తుంటారు. దీంతో కొందరు భార్యలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, తమ బాధను ఇంట్లో వారికి చెప్పుకోలేక తమ మనసులో పెట్టుకుని తీవ్రమైన మానసిక వేదనకు గురౌతుంటారు. ఇలాంటి పరిస్థితులలో కొందరు ఆత్మహత్యలు చేసుకొవడానికి కూడా వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat) దారుణమైన ఘటన జరిగింది. అహ్మదాబాద్ లోని గోటా ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో 12 ఫ్లోర్ లో.. కుల్దీప్ సిన్హ్, తన భార్య కూతురుతో కలిసి ఉంటున్నాడు. కుల్దీప్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే.. వీరిద్దరు తరచుగా గొడవలు పడేవారు. వీరు ఉంటున్న అపార్ట్ మెంట్ లో కింది ఫ్లోర్ లో.. కుల్దీప్ బంధువులు ఉంటున్నారు. వీరు ఎన్నోసార్లు వచ్చి.. భార్యభర్తల గొడవలను ఆపి సర్ది చెప్పారు. కానీ వీరి కుల్దీప్ ప్రవర్తన మాత్రం మారలేదు. ఎప్పుడు భార్యను సూటీపోటీ మాటలతో వేధించేవాడు.

ఈ క్రమంలో భర్త వేధింపులు భరించలేక.. మహిళ.. తన మూడేళ్ల కూతురుతో సహా 12 ఫ్లోర్ నుంచి కిందకు దూకేసింది. దీంతో అక్కడిక్కడే మరణించారు. వెంటనే చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. కాగా, బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తమిళనాడులో (Tamil nadu)  వింత చోరీజరిగింది.

తిరువళ్లూరు జిల్లాలోని కావేరి పెట్టై సమీపంలో ఉన్న వైన్ షాపులో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న వైన్ షాపులో చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చి మద్యం తాగుతుంటారు. అక్కడ అనేక రకాల బ్రాండ్ లు ఉంటాయి. అయితే.. కొందరు దుండగులు దీనిపై కన్నేశారు. ఎలాగైన దీనిలో చోరీ చేయాలని స్కెచ్ వేశారు. అయితే.. వైన్ సిబ్బంది దుకాణం మూసివేసి వెళ్లగానే.. మెల్లగా గొడకు రంధ్రం వేశారు. ఆ తర్వాత.. దానిలో నుంచి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లాక.. అక్కడ ఉన్న మద్యం బాటిళ్లను చూసి మైమర్చిపోయారు. అక్కడ కూర్చుని పీకల దాక కూర్చున్నారు.

అయితే.. అర్ధరాత్రిపూట షాపులో అలజడి రావడంతో గస్తీ కాస్తున్న పోలీసులు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. దుకాణం పక్కన రంధ్రం ఉండటాన్ని చూశారు.వెంటనే దొంగలను బయటకు రావాల్సిందిగా హెచ్చరించారు. గోడకు ఉన్న రంధ్రం నుంచి బయటకు రావడానికి దొంగలు నానా ఇబ్బందులు పడ్డారు. చివవకు ఎలాగోల బైటకు వచ్చారు. కాగా, చోరీకి పాల్పడింది.. చెన్నైకు చెందిన సతీష్, విల్లుపురానికి చెందిన మునియన్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 14వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరిని.. పోలీసులు స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Gujarat, Harassment on women, Suicide