Gujarat Bridge Collapse : గుజరాత్(Gujarat)లోని మోర్బీ(Morbi) పట్టణంలో ఆదివారం సాయంత్రం మచ్చు నదిపై నిర్మించిన బ్రిటీష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన(Suspension Bridge Collapse) ఘటనలో మృతుల సంఖ్య 130కి చేరుకుంది. ఇప్పటివరకు 177 మందిని అధికారులు రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సస్పెన్షన్ వంతెన ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కుప్పకూలింది. ఛత్ పూజ కోసం కొన్ని ఆచారాలు నిర్వహించడానికి సుమారు 500 మంది దానిపై గుమిగూడి ఉన్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో కేబుల్ వంతెనపై నిల్చున్న అనేకమంది సందర్శకులు నదిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలతో ఘటన స్తలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నదిలో పడిన వాళ్లలో చాలా మంది కేబుల్ వంతెన తెరను పట్టుకొని నిదానంగా బయటపడే ప్రయత్నం చేశారు.. వంతెన కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నది దగ్గర సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా,ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ఇదే..ఎన్ని సీట్లు,పొడవు ఎంతో తెలుసా
నదిలో కుప్పకూలిన వంతెన సుమారు 140సంవత్సరాల క్రితం బ్రిటీష్ కాలంలో నిర్మించినదిగా తెలుస్తోంది. ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు ఇటీవలే పూర్తి చేశారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. సందర్శకుల్ని అనుమతిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం జరగినట్లుగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gujarat