Home /News /crime /

GUJARAT AHMEDABAD STUDENT STABS CLASSMATE IN CHEST AT COACHING INSTITUTE AFTER DISPUTE PAH

కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో గొడవ.. ఇద్దరు విద్యార్థుల మధ్య కత్తిపొట్లు.. కారణం అదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: విద్యార్థులు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు. ప్రతిరోజు అక్కడ చదువుకునే వారు. ఈ క్రమంలో వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఇది కాస్త గొడవలకు దారితీసింది.

కొంత మంది విద్యార్థుల మనస్తత్వాలు వెర్వేరుగా ఉంటాయి. ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుంటారు. అందరి ముందు గ్రేట్ అనిపించుకొవాలని గొడవలకు పాల్పడుతుంటారు. కొన్ని చోట్ల ఇన్ స్టిట్యూట్ లలో అమ్మాయిల కోసం గొడవలు పడుతుంటారు. మరికొన్ని చోట్ల.. తమలో తామే గొడవలు పడుతుంటారు. పక్కవాడు.. చదువులో ముందున్న కొంత మంది కావాలని గొడవలకు దిగుతుంటారు. ఏదోఒక వంకతో గొడవ పెట్టుకుంటారు. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat)  అహ్మదాబాద్ లో దారుణ ఘటన జరిగింది. కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఆరునెలల క్రితం ఇద్దరు విద్యార్థులు చేరారు. మొదట్లో బాగానే ఉండే వారు. ఒకరి డౌట్ లను మరోకరు క్లారిఫై చేసుకునే వారు. కొన్ని రోజులకు వీరికి సబ్జెక్ట్ విషయంలో వాగ్వాదం (Disputes) జరిగింది. క్రమంగా వారి మధ్య గొడవలు జరిగాయి. అప్పటి నుంచి మరోక విద్యార్థి, తన తోటి విద్యార్థిపై దాడిచేయాలని ప్లాన్ లు వేస్తుండేవారు.



ఈ క్రమంలో.. వారికి.. గురువారం యువకుడు ఒక్కడే దొరికాడు. దీంతో అతడిని చుట్టుముట్టి కత్తులతో దాడులు చేశారు. కాగా, నిందితుడు కేవలం 16 ఏళ్ల బాలుడే కావడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా  కోల్ కతాలో (kolkata) ఒక దొంగ ఇంట్లో ప్రవేశించాడు.

సీఎం మమతా బెనర్జీ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న జాదు భట్టాచార్య లేన్ లో ప్రవేశించాడు. అక్కడ ఒక ఇంట్లోకి చోరి కోసం వెళ్లాడు. అక్కడ.. ఇంట్లో వారు మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు మెల్లగా చప్పుడు చేయకుండా ఇంట్లో ప్రవేశించాడు. అయితే, అక్కడ అలికిడి రావడంతో ఇంట్లోని వారు కిటీకి నుంచి చూశారు. దొంగలను గమనించారు. వెంటనే అలారం మోగించారు. అయితే.. ఇంట్లోని వారు బైటకు వచ్చారు. దీంతో దొంగ తనచేతిలో ఉన్న కత్తులతో ఇంట్లోని వారిపై దాడికి తెగబడ్డాడు.. అక్కడే ఉన్న ప్రసేన్ జిత్ చక్రవర్తిపై కత్తితో దాడి చేశాడు.

అయితే, వారు ఒక కుక్కను  (Pet dog) పెంచుకుంటున్నారు. అది దొంగ మీద దాడి చేసింది. అతడిని కిందపడేసి చేతులను, కాళ్లను కొరికింది. దీంతో అతను గాయాలపాలయ్యాడు. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను అదుపులోనికి తీసుకున్నారు. అతడికి కుక్క కరిచిన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతడిని చూసిన వైద్యులు మెడ, భూజానికి 35 చోట్ల గాయాలయ్యాయని తెలిపారు. వీటికి కుట్లు వేశారు. కుక్క దాడిని ఘటనను చూసి.. పోలీసులే షాక్ అయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Gujarat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు