• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • GUJARAT AHMEDABAD FAKE NURSE ARRESTED IN AHMEDABAD ALONG WITH TWO FAKE DOCTORS HERE IS THE FULL DETAILS OF THIS CRIME NEWS NK

Nurse Arrest: ఈ నర్స్‌ చేసిన నేరమేంటి? పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు?

Nurse Arrest: ఈ నర్స్‌ చేసిన నేరమేంటి? పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు?

ఈ నర్స్‌ చేసిన నేరమేంటి?

Nurse Arrest: ఆ నర్స్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో... ఆమె ఎవరు, ఎందుకు అరెస్టు చేశారనే అంశం తెరపైకి వచ్చింది. దాంతో పెద్ద దుమారం రేగింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
    Nurse Arrest: ఈ కరోనా వచ్చాక... డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు చాలా బిజీ అయిపోయారు. వారికి క్షణం తీరిక ఉండట్లేదు. ఇలాంటి సమయంలో... గుజరాత్... అహ్మదాబాద్‌లో... యువ నర్స్ రీనాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఎందుకు అరెస్టు చేశారని మీడియా ప్రశ్నించగా పోలీసులు ఓ విషయం చెప్పారు. ఈ రీనా... ఓ కోవిడ్ ఆస్పత్రి (Spurs Hospital)లో నర్సుగా చేస్తోంది. ఆస్పత్రికి దగ్గర్లోని
    అమ్రాయ్‌వాదిలో... ఓ కుటుంబంలోని విశాల్‌భాయ్‌కి కరోనా సోకింది. ఆ విషయం ఈ నర్సుకు మాత్రమే తెలిసింది. ఆ విషయాన్ని మరో ఇద్దరు కూడా తెలుసుకున్నారు. రీనాతో కలిసి... ఓ ప్లాన్ వేశారు. డబ్బుకి ఆశపడి... ఆమె సరే అంది. వెంటనే... ఆమెతో కలిసి ఈ ముగ్గురి గ్యాంగ్ ఆ కరోనా పేషెంట్ ఇంటికి వెళ్లింది. ఈ గ్యాంగ్ సభ్యులు నిజమైన డాక్టర్లలా నటించారు. ఆమె నిజమైన నర్సే కావడంతో... ఆమె మాటలు నమ్మి ఆ కుటుంబ సభ్యులు... పేషెంట్‌ని ఇంటిదగ్గరే ఉంచారు. 15 రోజుల్లో ట్రీట్‌మెంట్ పూర్తి చేస్తామని రూ.లక్షన్నర తీసుకున్నారు. నకిలీ ట్రీట్‌మెంట్ మొదలైంది.

    ఆ మందులు, ఈ టీకాలు అంటూ... ఈ ముగ్గురి టీమ్... రకరకాల ఖర్చులు పెట్టించారు. ఆ పేషెంట్ పరిస్థితి నానాటికీ తీవ్రం అయ్యింది. దాంతో ఆ గ్యాంగ్ పారిపోయింది. ఈ అమ్మాయి నిజమైన నర్స్ కాబట్టి... పారిపోకుండా... తన ఇంట్లోనే ఉంది. ఆస్పత్రికి రెగ్యులర్‌గా వెళ్లి డ్యూటీలు చేస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు హడావుడిగా విశాల్ భాయ్‌ని అదే కోవిడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జరిగింది చెప్పారు. అక్కడి నిజమైన డాక్టర్లేమో... తాము ఎవరినీ పంపలేదనీ... అసలు ఈ విషయమే తమకు తెలియదని అన్నారు. ఐతే... పరిస్థితి విషమించడంతో విశాల్ భాయ్ ఆస్పత్రిలో చనిపోయారు. ముందే తీసుకొచ్చి ఉంటే బతికించేవాళ్లం అని డాక్టర్లు చెప్పడంతో... తాము మోసపోయామనీ, తమ కుటుంబ సభ్యుణ్ని కోల్పోయామని బాధితులు తీవ్ర ఆవేదన చెందారు. విషాదంలో మునిగిపోయారు.

    పారిపోయిన ఇద్దరూ నరేంద్ర పాండ్య, సొహైల్ షేక్. ఇద్దరూ ఇసాన్‌పూర్‌లో ఉండేవారు. బాధిత కుటుంబ సభ్యులు ట్రీట్‌మెంట్ కోసం ఇచ్చిన రూ.లక్షన్నరను ఆ ఇద్దరే పట్టుకుపోయారు. నర్సుకు ఏమీ ఇవ్వలేదు. బాధిత కుటుంబ సభ్యులు... ఆ నర్సును పట్టుకున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను ప్రశ్నించి... ఆ ఇద్దరి వివరాలూ తెలుసుకొని... వాళ్లను కూడా అరెస్టు చేశారు.

    ఇది కూడా చదవండి: Viral videos: టిక్‌టాక్ లైఫ్ హ్యాక్ వీడియోలకు షాక్... వైరల్ అవుతున్న ఖాబీ లేమ్ టిప్స్

    ఏమాత్రం అనుభవం లేని వాళ్లు ఇలా ఎలా నటించారు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ నరేంద్ర పాండ్య, సోహైల్ షేక్... ఇద్దరూ అదే కోవిడ్ ఆస్పత్రి (Spurs Hospital)లో కాంపౌండర్లుగా పనిచేస్తున్నారు. అక్కడకు వచ్చే కరోనా పేషెంట్లకు జరిగే ట్రీట్‌మెంట్ చూసి... ఈ మాత్రం మేము చెయ్యలేమా అని అనుకొని... ఈ డ్రామా ఆడారు. ప్రాణం తీశారు. ఐతే... ఈ ముగ్గురి వెనకా... మరో నిజమైన డాక్టర్ ఎవరో ఉండే ఉంటారనే డౌట్ పోలీసులకు ఉంది. కానీ అంత లోతుగా దర్యాప్తు చేసే టైమ్ ఇప్పుడు వారికి లేదు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు