గుడివాడలో కేడీ జంట.. చిట్టీల పేరుతో రూ.4కోట్లతో పరార్..

చిట్టీల పేరుతో ప్రజల వద్ద భారీగా డబ్బులు కలెక్ట్ చేసి సుమారు రూ.4కోట్లకు వారికి కుచ్చుటోపీ పెట్టి పారిపోయారు దంపతులు.

news18-telugu
Updated: July 17, 2020, 8:43 PM IST
గుడివాడలో కేడీ జంట.. చిట్టీల పేరుతో రూ.4కోట్లతో పరార్..
సత్యవతి (Fil)
  • Share this:
చిట్టీల పేరుతో ప్రజల వద్ద భారీగా డబ్బులు కలెక్ట్ చేసి సుమారు రూ.4కోట్లకు వారికి కుచ్చుటోపీ పెట్టి పారిపోయారు దంపతులు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ చిట్టీల వ్యాపారి బాగోతం వెలుగులోకి వచ్చింది. గుంటూరు 35 వార్డులో చిట్టిల పేరుతో నాలుగు కోట్లు వసూలు చేసి లక్ష్మణరావు, సత్యవతి దంపతులు పారిపోయారు. అప్పటి వరకు ఉన్న దంపతులు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ ఇంటి వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఇంటి వద్దకు వచ్చారు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, బంధువుల ఇళ్ల దగ్గర కూడా లేకపోవడందో వారు పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికులతో నమ్మకంగా ఉంటూ పలువురు నుంచి చిన్న మొత్తం నుంచి భారీ స్థాయిల చిట్టీలు నిర్వహించినట్టు బాధితులు పోలీసులకు తెలిపారు. అందరి వద్ద కలిపి సుమారు రూ.4కోట్ల వరకు చిట్టీలు కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2020, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading